ETV Bharat / sports

సచిన్ 'డీప్​ ఫేక్'​ వీడియో - ఆ కంపెనీ యజమానిపై కేసు

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 18, 2024, 2:05 PM IST

Sachin Deep Fake Video :క్రికెట్​ గాడ్​ సచిన్​ ఫేస్​ను ఉపయోగించుకున్ని నెట్టింట వైరల్​ అయిన డీఫ్​ ఫేక్​ వీడియో విషయంలో తాజాగా ముంబయి పోలీసులు స్పందించారు. ఓ గేమింగ్​ యాప్ యజమానిపై కేసు నమోదు చేసుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే ?

Sachin Deep Fake Video
Sachin Deep Fake Video

Sachin Deep Fake Video : ఇటీవలే క్రికెట్ గాడ్​ సచిన్ తెందూల్క్​ర్​కు సంబంధించిన ఓ డీప్‌ఫేక్‌ వీడియో నెట్టింట తెగ వైరలైన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై తాజాగా సచిన్ వ్యక్తిగత సహాయకుడు రమేశ్ పార్డే ఫిర్యాదు చేశారు. ఆయన కంప్లైంట్​ను పరిగణనలోకి తీసుకున్న ​ముంబయి సైబర్ సెల్ పోలీసులు గురువారం ఓ గేమింగ్‌ యాప్​ కంపెనీ యజమానిపై కేసు నమోదు చేశారు. తదుపరి విచారణకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే ?
Sachin Deep Fake Video Case : ఏఐను దుర్వినియోగం చేస్తూ సెలబ్రిటీలపై కొంతమంది వ్యక్తులు వీడియోలు చేస్తున్నారు. గతంలో రష్మిక, ఆలియాపై కూడా ఇలాంటి వీడియోలు వచ్చాయి. అయితే తాజాగా సచిన్​పై కూడా ఓ వీడయో వచ్చింది. అందులో ఆయన 'స్కైవార్డ్‌ ఏవియేటర్‌ క్వెస్ట్' అనే గేమింగ్‌ యాప్‌నకు ప్రచారం చేస్తున్నట్లు అందులో ఉంది.

ఇక ఈ వీడియో నెట్టింట తెగ వైరలై సచిన్ దృష్టిలో పడింది. దీంతో వీడియోలో ఉన్నది తాను కాదంటూ ఆయన వివరణ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఈ వీడియో చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "టెక్నాలజీని ఇలా విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడం నాకు ఎంతో ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి వీడియోలు, యాడ్స్​, యాప్స్​ ఎక్కడ ఉన్నా సరే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయండి. ఫేక్ ఇన్​ఫర్మేషన్​, డీప్‌ఫేక్‌ వీడియోల వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలి. వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి" అంటూ ట్విట్టర్​లో సచిన్ పోస్ట్ చేశారు.

  • These videos are fake. It is disturbing to see rampant misuse of technology. Request everyone to report videos, ads & apps like these in large numbers.

    Social Media platforms need to be alert and responsive to complaints. Swift action from their end is crucial to stopping the… pic.twitter.com/4MwXthxSOM

    — Sachin Tendulkar (@sachin_rt) January 15, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మరోవైపు సచిన్‌ కుమార్తె సారా తెందూల్కర్‌ కూడా డీప్‌ ఫేక్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. టీమ్‌ ఇండియా క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌తో సారా ఉన్నట్లుగా ఓ మార్ఫింగ్‌ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. సారా తన సోదరుడు అర్జున్‌ తెందూల్కర్‌తో ఉన్న ఫొటోను డీప్‌ఫేక్‌ చేశారు. అర్జున్‌ ముఖం స్థానంలో గిల్‌ ఫొటోను మార్చి వైరల్‌ చేశారు. దీనిపై ఆమె తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేశారు. ఇక, కొంతమంది తన పేరుతో ఫేక్ అకౌంట్స్​ తెరిచారని, వాటిని నమ్మొద్దని పేర్కొన్నారు.

'నా డీప్​ఫేక్​ వీడియోలు వైరల్ అయ్యాయి'- సచిన్​ కుమార్తె సారా ఆవేదన

అప్పుడు రష్మిక, ఇప్పుడు సచిన్- డీప్​ఫేక్​తో బెట్టింగ్ మోసం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.