ETV Bharat / sports

'వెదురుతో క్రికెట్​ బ్యాట్ చట్ట విరుద్ధం'

author img

By

Published : May 11, 2021, 3:39 PM IST

cricket bat
క్రికెట్​ బ్యాట్​

ఐసీసీ నిబంధనల ప్రకారం వెదురు బ్యాట్లను ఉపయోగించడం చట్టవిరుద్ధమని తెలిపింది మెరిల్​బోన్​ క్రికెట్​ క్లబ్(ఎమ్​సీసీ)​​. దీని గురించి చర్చ జరపాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.

క్రికెట్ బ్యాట్​ తయారీకి ఇంగ్లీష్​ విల్లో లేదా కశ్మీర్​ విల్లోకు బదులుగా వెదురును ఉపయోగిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ​కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయ అధ్యయన బృందం సోమవారం తెలిపింది. ప్రస్తుతం దీనిపై పరిశోధనలు జరుపుతున్నట్లు వెల్లడించింది. అయితే ఇది ఐసీసీ నిబంధనల ప్రకారం చట్ట విరుద్ధమని తెలిపింది మెరిల్​బోన్​ క్రికెట్​ క్లబ్(ఎమ్​సీసీ)​​. దీనిపై చర్చ జరిపి నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.

"చట్ట ప్రకారం బ్యాట్ బ్లేడ్ కేవలం చెక్కతో ఉండాలి. కాబట్టి విల్లోకు ప్రత్యామ్నాయంగా వెదురును పరిగణలోకి తీసుకోవాలంటే చట్టంలో మార్పులు అవసరం. ఒకవేళ వెదురును చెక్కగా పరిగణించాలన్నా ప్రస్తుతానికి అది చట్ట విరుద్ధమవుతుంది. జూనియర్​ బ్యాట్స్​ మినహా మిగతా బ్యాట్​ బ్లేడ్ల తయారీలో అవి నిషేధం. బ్యాట్​, బంతికి మధ్య సమతుల్యం ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వెదురును ఉపయోగించే విషయంలో చాలా నిబంధనలపై దృష్టిసారించాలి" అని వివరణ ఇచ్చింది ఎంసీసీ.

ఇదీ చూడండి: క్రేజీ ఐడియా.. వెదురుతో క్రికెట్​ బ్యాట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.