వెడ్డింగ్​ కార్డుపై 'ధోనీ' ఫొటో.. పెళ్లికి చీఫ్​ గెస్ట్​ కూడా అతడే!

author img

By

Published : Mar 11, 2023, 4:04 PM IST

Fan Printed Dhoni Photo on Wedding Card

ప్రపంచ క్రికెట్​ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ప్లేయర్​ ఎమ్​ఎస్​ ధోనీ. తన ఆటతో అశేష అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఓ ధోనీ ఫ్యాన్​ చేసిన పని సర్వత్రా చర్చనీయాంశమైంది. తన పెళ్లి శుభలేఖపై ధోనీ ఫొటో ప్రింట్ చేయించి.. అతడిపై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు.

ఇండియాలో క్రికెట్​ ఓ మతం అంటుంటారు. దానికి తగ్గట్టుగానే క్రికెటర్లను దేవుళ్లుగా కొలుస్తారు అభిమానులు. తమ అభిమాన ఆటగాడి కోసం కటౌట్లు కడతారు, టీ షర్టులపై బొమ్మలు, పచ్చ బొట్టు వేయించుకుంటారు. ఆ కోవలోనే నడిచాడు మరో అభిమాని. ఈ ఫ్యాన్​ ఇంకొంచెం కొత్తగా ఆలోచించాడు. తన పెళ్లి శుభలేఖపై వినాయకుడి ఫొటోతో పాటు తన అభిమాన క్రికెటర్​ మహేంద్ర సింగ్​ ధోనీ ఫొటో కూడా ప్రింట్​ చేయించాడు. 2013లో ఛాంపియన్స్​ ట్రోఫీలోని ఓ ఫొటోను పెళ్లి కార్డుపై ముద్రించాడు. ప్రస్తుతం ఈ వెడ్డింగ్​ కార్డు నెట్టింట్లో వైరల్​ అవుతోంది. ఈ ఫొటోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ధోనీ జెర్సీ నంబర్​ 7 ఉద్దేశిస్తూ.. "అతడు 7 జన్మల బంధం కోసం 7 అడుగులు వేయాలనుకున్నాడు." అని ఓ నెటిజన్ కామెంట్​ చేయగా.. 'మొదట చూసినప్పుడు ఇది ధోనీ వెడ్డింగ్​ కార్డు అనుకున్నా..' అన్నీ ఫన్నీగా రాసుకొచ్చాడు. అయితే ఆ అభిమాని పెళ్లికి ధోనీ గెస్ట్​గా వస్తాడేమోనని కామెంట్​ చేశాడు మరో నెటిజన్.

Fan Printed Dhoni Photo on Wedding Card
ధోని ఫొటో ప్రింట్​ చేసిన పెళ్లి శుభలేఖ

సౌరభ్​ గంగూలీ కెప్టెన్​గా ఉన్నప్పుడు భారత క్రికెట్​ జట్టులోకి ఆడుగుపెట్టిన ధోనీ.. ఆ తర్వాత భారత క్రికెట్​ స్వరూపాన్ని సమూలంగా మార్చేశాడు. ప్రపంచ క్రికెట్​ చరిత్రలో ఓ చెరగని అధ్యాయం లిఖించాడు. ఓ దశాబ్దం పాటు క్రికెట్​ను శాసించాడు. దిగ్గజాలు సైతం సలాం చేసే స్థాయికి ఎదిగాడు. మైదానంలో ధోనీ ఉంటే.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా టీమ్​ గెలుస్తుందని అభిమానులు అనుకునేంతలా.. అతడి ప్రదర్శన ఉండేది. కెప్టెన్​గా జట్టును నడిపించిన తీరు కూడా అతడిని అగ్రస్థానానికి తీసుకెళ్లింది. ధోనీ సారథ్యంలోనే 2007 టీ20 వరల్డ్​ కప్​, 2011 వన్డే వరల్డ్​ కప్​ను టీమ్​ఇండియా గెలిచింది. ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ధోనీ.. అంచెలంచెలుగా ఎదిగి క్రికెటర్​ కావాలనున్న వారిలో స్ఫూర్తి నింపాడు. అలాంటి మహీకి ఇలాంటి అభిమానులుండటం సహజమే.

  • In first sight I thought it's Dhoni's wedding card 😄 🤣

    — Deepak L Makwana (@DeepakLMakwana1) March 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అంతర్జాతీయ కెరీర్​కు గుడ్​బాయ్​ చెప్పిన ధోనీ.. మార్చి 31న ప్రారంభం కానున్న ఐపీఎల్​ 2023లో చెన్నై సూపర్​ కింగ్స్​​ తరఫున ఆడనున్నాడు. టీమ్​ఇండియా కెప్టెన్​గా జట్టును అగ్ర స్థానంలో నిలబెట్టిన ధోనీ.. ఇప్పటి వరకు 90 టెస్టులు ఆడాడు. అందులో 4876 పరుగులు చేశాడు. ఆరు సెంచరీలు, 33 హాఫ్​ సెంచరీలు సాధించాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 224 నమోదు చేశాడు. ఇక 350 వన్డేల్లో 297 ఇన్నింగ్స్​లో 10 సెంచరీలు, 73 హాఫ్​ సెంచరీలతో 10,773 పరుగులు బాదాడు. అత్యధికంగా 183 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు. 98 అంతర్జాతీయ టీ20లు ఆడిన ధోనీ.. 1,617 పరుగులు చేశాడు. ఇక, ఈసారి ఐపీఎల్​ను ఉచితంగా ప్రసారం చేస్తున్న జియో సినిమాకు అంబాసిడర్​గా ధోనీ వ్యవహరిస్తున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.