WPL 2023 : 'RCB ఓటమికి నేనే కారణం'.. స్మృతి మంధాన షాకింగ్​ కామెంట్స్

author img

By

Published : Mar 11, 2023, 1:09 PM IST

smrithi mandhana about rcb
smrithi mandhana ()

WPL 2023 : మహిళల ప్రీమియర్‌ లీగ్‌ 2023లో బెంగళూరు టీమ్​ను ఓటములు వెంటాడుతున్నాయి. ఆ టీమ్​ ఖాతా తెరవలేకపోయింది. శుక్రవారం యూపీ వారియర్స్​తో జరిగిన మ్యాచ్‌లోనూ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలో టీమ్​ కెప్టెన్​ స్మృతి.. ఆర్​సీబీ ఓటమికి తనదే బాధ్యత అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఏమన్నారంటే..

WPL 2023 : మహిళల ప్రీమియర్​ లీగ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు వరుస ఓటములను చవిచూస్తోంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఆర్‌సీబీ గెలుపొందలేకపోయింది. ఇక, శుక్రవారం యూపీ వారియర్స్​తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో దారుణంగా ఓడింది. ఈ ఓటములన్నింటికి పూర్తి బాధ్యత తానే వహిస్తున్నట్లు ఆర్‌సీబీ కెప్టెన్‌ స్మృతి మంధాన తెలిపింది. మ్యాచ్‌ తర్వాత ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమె ఫ్యాన్స్​ ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు.

''గత నాలుగు మ్యాచ్‌లుగా ఇదే కొనసాగుతోంది. ఆడిన ప్రతీ మ్యాచ్‌లో మంచి ఆరంభం లభించినప్పటికీ.. ఆ తర్వాత నుంచి వికెట్లు కోల్పోతున్నాం. అదే మా మ్యాచ్‌లపై ప్రభావం చూపిస్తోంది. అంతే కాకుండా మా గేమ్‌ ప్లాన్‌ కూడా సరిగా లేనందున వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయాం. అందుకే ఈ ఓటములకు పూర్తి బాధ్యత నేనే తీసుకుంటున్నా. ఒక బ్యాటర్‌గా నేను పూర్తిగా ఫెయిలవుతున్నా. టాప్​ ఆర్డర్​ బ్యాటింగ్‌ మెరుగుపడాల్సి ఉంది. ఓటములతో గడిచిన వారం మాకు చాలా కష్టంగా అనిపించింది. ఇక నా ఫ్యామిలీ ఎప్పుడు నాకు సపోర్ట్‌గా ఉంటుంది. ఒంటరిగా కూర్చొని ఓటమికి గల కారణాలను వెతికి సరిచేసుకోవడమే''

--స్మృతి మంధాన, డబ్ల్యూపీఎల్​ ఆర్​సీబీ కెప్టెన్

మరోవైపు శుక్రవారం జరిగిన మ్యాచ్​లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 19.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. ఎలిస్‌ పెర్రీ 52 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా మారగా.. సోఫి డివైన్‌ 36 పరుగులు చేసింది. ఇక మిగిలిన జట్టు సభ్యులు మైదానంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అటు యూపీ వారియర్స్​ బౌలర్​ ఎసెల్‌స్టోన్‌ నాలుగు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ మూడు వికెట్లను పడగొట్టింది. ఇక యూపీ వారియర్స్​ బ్యాటింగ్‌ చేసినప్పుడు.. 13 ఓవర్లలోనే వికెట్‌ కోల్పోకుండా లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్‌ అలిసా హీలీ (47 బంతుల్లో 96 నాటౌట్‌, 18 ఫోర్లు, ఒక సిక్సర్‌) మెరుపులు మెరిపించగా.. దేవికా వైద్య 36 పరుగులను సాధించింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: స్మృతి మంధాన(కెప్టెన్‌), ఎల్లీస్ పెర్రీ, సోఫీ డివైన్, సహానా పవార్, హీథర్ నైట్, ఎరిన్ బర్న్స్, కనికా అహుజా, కోమల్ జంజాద్, రేణుకా సింగ్, రిచా ఘోష్(వికెట్‌ కీపర్‌), శ్రేయంక పాటిల్.

యూపీ వారియర్స్​: అలిస్సా హీలీ(కెప్టెన్‌), కిరణ్ నవ్‌గిరే, శ్వేతా సెహ్రావత్, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, దేవిక వైద్య, సిమ్రాన్ షేక్, సోఫీ ఎక్లెస్టోన్, అంజలి శర్వాణి, రాజేశ్వరి గైక్వాడ్, తహ్లియా మెక్‌గ్రాత్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.