ETV Bharat / sports

KKR Vs PBKS: కోల్​కతాపై విజయం.. పంజాబ్​ ప్లేఆఫ్‌ ఆశలు సజీవం

author img

By

Published : Oct 2, 2021, 7:00 AM IST

కోల్​కతా నైట్​రైడర్స్​తో(KKR vs PBKS match) జరిగిన మ్యాచ్​లో పంజాబ్​ కింగ్స్​ జట్టు విజయం సాధించింది(IPL 2021). ప్రత్యర్థి నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొత్తం 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో ప్లేఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

ipl
ఐపీఎల్​

ఈ సీజన్లో(KKR vs PBKS 2021) దురదృష్టానికి మారుపేరుగా మారిన పంజాబ్‌ కింగ్స్‌ను తొలిసారి అదృష్టం వరించింది. ఒత్తిడిలో మరోసారి మ్యాచ్‌ చేజార్చుకుంటుందేమో అనుకున్న ఆ జట్టు పట్టుదలగా ఆడి విజయాన్ని అందుకుంది(IPL 2021). మొదట భారీ స్కోరు చేసేలా కనిపించిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కళ్లెం వేసిన పంజాబ్‌.. బ్యాటింగ్‌లో తడబడినా నిలబడి విజేతగా నిలిచింది. మొత్తం 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో ప్లేఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌(KKR vs PBKS Highlights) ఇంకా ఉంది. బాగా ఆడినా ఓటములతో వెనకబడిన ఆ జట్టు గత మ్యాచ్‌లో(KKR vs PBKS match) అందుకున్న ఫామ్‌ను కొనసాగించింది. ఓ కీలక విజయంతో ప్లేఆఫ్స్‌కు రేసులోనే నిలిచింది. శుక్రవారం మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు చేసింది. వెంకటేశ్‌ అయ్యర్‌ (67; 49 బంతుల్లో 9×4, 1×6) టాప్‌స్కోరర్‌. అర్ష్‌దీప్‌ (3/32) రాణించాడు. రాహుల్‌ (67; 55 బంతుల్లో 4×4, 2×6), మయాంక్‌ (40; 27 బంతుల్లో 3×4, 3×6) రాణించడం వల్ల లక్ష్యాన్ని పంజాబ్‌ 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

పంజాబ్‌ జోరుగా: ఛేదనలో పంజాబ్‌(punjab kings versus kkr) మొదటి నుంచి ధాటిగా ఆడింది. ఓపెనర్లు రాహుల్‌, మయాంక్‌ స్వేచ్ఛగా షాట్లు షాట్లు కొడుతూ స్కోరు పెంచారు. ముఖ్యంగా ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లోనే జీవనదానం పొందిన మయంక్‌ చెలరేగి ఆడాడు. పవర్‌ ప్లే ఆఖరికి పంజాబ్‌ 46/0తో నిలిచింది. ఈ జోడీ బలపడుతున్న స్థితిలో వరుణ్‌ బౌలింగ్‌లో మోర్గాన్‌ పట్టిన క్యాచ్‌కు మయాంక్‌ వెనుదిరిగాడు. అతడు ఔటైన తర్వాత పంజాబ్‌ పరుగుల వేగానికి తాత్కాలికంగా కళ్లెం పడింది. అయితే మార్‌క్రమ్‌ (16 బంతుల్లో 18) తోడుగా చెలరేగిన రాహుల్‌ పంజాబ్‌ను గాడిలో పెట్టాడు. సమీకరణం 34 బంతుల్లో 55 పరుగులుగా మారినా.. రాహుల్‌, మార్‌క్రమ్‌ ధాటిగా ఆడడంతో పంజాబ్‌ విజయానికి చేరువగానే కనిపించింది. అయితే ఓవర్‌ తేడాతో మార్‌క్రమ్‌తో పాటు హుడా (3) వికెట్లు కోల్పోయిన పంజాబ్‌ ఒత్తిడిలో పడిపోయింది. కానీ ధాటిగా ఆడిన షారుక్‌ ఖాన్‌ (22 నాటౌట్‌; 1×4, 2×6) పంజాబ్‌ను తిరిగి లక్ష్యం దిశగా నడిపించాడు. చివరి ఓవర్లో 5 పరుగులు చేయాల్సి రాగా.. రెండో బంతికి రాహుల్‌ ఔట్‌ కావడం వల్ల ఉత్కంఠ నెలకొన్నా.. షారుక్‌ఖాన్‌ ఆ తర్వాత బంతికి సిక్స్‌తో జట్టును గెలిపించాడు.

ఆఖర్లో కళ్లెం: అంతకుముందు కోల్‌కతా(KKR vs PBKS match news) ఇన్నింగ్స్‌ మెరుగ్గానే ఆరంభమైనా మూడో ఓవర్లో పేసర్‌ అర్ష్‌దీప్‌ ఓ అద్భుతమైన ఫుల్‌ డెలివరీతో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (7)ను క్లీన్‌ బౌల్డ్‌ చేసి పంజాబ్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. కానీ అయ్యర్‌ మాత్రం తగ్గలేదు. త్రిపాఠి (34) కూడా షాట్లకు దిగడం వల్ల నైట్‌రైడర్స్‌ 11 ఓవర్లకు 88/1తో నిలిచింది. అయితే త్రిపాఠిని ఔట్‌ చేయడం ద్వారా లెగ్‌స్పిన్నర్‌ బిష్ణోయ్‌ ఈ భాగస్వామ్యానికి తెరదించాడు. అర్ధసెంచరీ తర్వాత అయ్యర్‌ షాట్‌ ఆడబోయి వెనుదిరిగాడు. ఆ తర్వాత నితీష్‌ రాణా (31; 18 బంతుల్లో 2×4, 2×6) రెండు సిక్స్‌లు బాదినా.. అతడు ఔటైన తర్వాత కోల్‌కతా వేగంగా పరుగులు చేయలేకపోయింది.

కోల్‌కతా ఇన్నింగ్స్‌: వెంకటేశ్‌ అయ్యర్‌ (సి) హుడా (బి) బిష్ణోయ్‌ 67; గిల్‌ (బి) అర్ష్‌దీప్‌ 7; త్రిపాఠి (సి) హుడా (బి) బిష్ణోయ్‌ 34; నితీష్‌ రాణా (సి) మయాంక్‌ (బి) అర్ష్‌దీప్‌ 31; మోర్గాన్‌ ఎల్బీ (బి) షమి 2; దినేశ్‌ కార్తీక్‌ (బి) అర్ష్‌దీప్‌ 11; సీఫెర్ట్‌ రనౌట్‌ 2; నరైన్‌ నాటౌట్‌ 3; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 165; వికెట్ల పతనం: 1-18, 2-90, 3-120, 4-124, 5-149, 6-156, 7-165 బౌలింగ్‌: అలెన్‌ 4-0-38-0; షమి 4-0-23-1; అర్ష్‌దీప్‌ సింగ్‌ 4-0-32-3; ఎలిస్‌ 4-0-46-0; రవి బిష్ణోయ్‌ 4-0-22-2

పంజాబ్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) మావి (బి) వెంకటేశ్‌ 67; మయాంక్‌ (సి) మోర్గాన్‌ (బి) వరుణ్‌ 40; పూరన్‌ (సి) మావి (బి) వరుణ్‌ 12; మార్‌క్రమ్‌ (సి) గిల్‌ (బి) నరైన్‌ 18; హుడా (సి) త్రిపాఠి (బి) మావి 3; షారుక్‌ ఖాన్‌ నాటౌట్‌ 22; అలెన్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (19.3 ఓవర్లలో 5 వికెట్లకు) 168

వికెట్ల పతనం: 1-70, 2-84, 3-129, 4-134, 5-162 బౌలింగ్‌: సౌథీ 4-0-40-0; మావి 4-0-31-1; వరుణ్‌ 4-0-24-2; నరైన్‌ 4-0-34-1; వెంకటేశ్‌ 2.3-0-30-1; నితీష్‌ రాణా 1-0-7-0

ఇదీ చూడండి: MIvsDC 2021: దిల్లీతో ముంబయి అమీతుమీ.. ప్లే ఆఫ్స్​ రేసు లక్ష్యంగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.