ETV Bharat / sports

సన్​రైజర్స్​కు బిగ్​ షాక్​.. సీజన్ మొత్తానికి కీలక ప్లేయర్ దూరం​!

author img

By

Published : Apr 27, 2023, 12:11 PM IST

Updated : Apr 27, 2023, 12:42 PM IST

washington sundar injury
washington sundar

ఐపీఎల్​ టీమ్​ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయాల కారణంగా ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.

ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుస అపజయాలను మూటగట్టుకుంటున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. తీవ్ర గాయాల కారణంగా ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్.. ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ బాధాకరమైన విషయాన్ని సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ ట్విట్టర్​ వేదికగా గురువారం ప్రకటించింది. తొడ కండరాల గాయంతో భాదపడుతున్న సుందర్​.. ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడని ట్వీట్​లో పేర్కొంది. అంతే కాకుండా అతను త్వరగా కోలుకోవాలని ఫ్రాంచైజీ ఆశిస్తున్నట్లు తెలిపింది.

  • 🚨 INJURY UPDATE 🚨

    Washington Sundar has been ruled out of the IPL 2023 due to a hamstring injury.

    Speedy recovery, Washi 🧡 pic.twitter.com/P82b0d2uY3

    — SunRisers Hyderabad (@SunRisers) April 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఐపీఎల్​ వేలంలో వాషింగ్టన్ సుందర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.8.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. తొలి 6 మ్యాచుల్లో కనీసం ఒక్క వికెట్ కూడా తీయని సుందర్.. దిల్లీతో జరిగన మ్యాచ్​తో ఫామ్​లోకి వచ్చాడు. ఇటీవల దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్​రౌండర్​ వాషింగ్టన్ సుందర్ అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచాడు. ఒకే ఓవర్‌లో మూడు కీలక వికెట్లను పడగొట్టి ఔరా అనిపించాడు.

8 ఓవర్‌ రెండో బంతికి వార్నర్​ను, నాలుగో బంతికి సర్ఫరాజ్ ఖాన్​ను, చివరి బంతికి అమాన్‌ ఖాన్​ను పెవిలియన్‌ బాట పట్టించాడు. కాగా ఈ ముగ్గురూ క్యాచ్‌ ఔట్ కావడం గమనార్హం. తన బౌలింగ్​ స్కిల్స్​తో మూడు వికెట్లు పడగొట్టిన సుందర్.. బ్యాటింగ్‌లోనూ ఇరగదీశాడు. దీంతో ఆ మ్యాచ్​లో దిల్లీ ప్లేయర్లకు చుక్కలు చూపించాడు.

ఒక్కప్పుడు తన గేమ్​కు ట్రోలింగ్​ ఎదుర్కొన్న సుందర్​ ఇప్పుడు అద్భుతమైన ప్రదర్శనతో అందరి చేత శభాష్​ అనిపించుకుంటున్నాడు.ఈ క్రమంలో సుందర్​ ఇలా ఫామ్​లోకి వస్తున్న సమయంలో గాయం బారిన పడి జట్టుకు దూరమవ్వడం చాలా బాధగా ఉందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే లోయర్​ ఆర్డర్​ బ్యాటింగ్‌ లేక ఇబ్బంది పడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సుందర్ దూరమవ్వడం ఓ కోలుకోలేని దెబ్బ అని అంటున్నారు.

ఇలా వరుస ఎదురుదెబ్బలను ఎదుర్కొంటున్న సన్​రైజర్స్​ టీమ్​కు ఇప్పుడు టీమ్ కాంబినేషన్ కూడా ఇబ్బంది కానుంది. ఇప్పటి వరకు అయితే సుందర్ స్థానంలో రానున్న ఆటగాడి పేరును ఫ్రాంచైజీ ప్రకటించలేదు. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్​ల్లోనూ సన్‌రైజర్స్ రెండింటిలో మాత్రమే గెలిచి పాయింట్స్ పట్టికలో 9వ స్థానానికి ఎగబాకింది.

ఇక ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన 7 మ్యాచ్‌ల్లో కనీసం 5 మ్యాచ్‌లైనా గెలిచి తీరాలి. అంతే కాకుండా రన్ రేట్ కూడా మెరుగ్గా ఉండాలి. కానీ వాషింగ్టన్ సుందర్ దూరమవ్వడంతో పాటు.. జట్టులో అతన్ని భర్తీ చేసే ఆటగాడు లేకపోవడం కూడా ఇప్పుడు సన్‌రైజర్స్ విజయవకాశాలను దెబ్బతీసే అవకాశలున్నాయి.

Last Updated :Apr 27, 2023, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.