ETV Bharat / sports

ఇషాన్​ ధనాధన్ ఇన్నింగ్స్​.. వెంకటేశ్​ సెంచరీ వృథా.. ముంబయి సూపర్ విక్టరీ

author img

By

Published : Apr 16, 2023, 7:23 PM IST

Updated : Apr 16, 2023, 8:07 PM IST

mi vs kkr result IPL 2023
mi vs kkr result IPL 2023

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్ 16వ సీజన్​లో భాగంగా కోల్​కతా​, ముంబయి​ జట్ల మధ్య మ్యాచ్​లో ముంబయి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇషన్​ కిషన్, సూర్య కుమార్​ యాదవ్​ హాఫ్​ సెంచరీ పూర్తి చేశారు. వెంకటేశ్​ అయ్యర్​ సెంచరీ వృథా అయింది.

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్ 16వ సీజన్​లో భాగంగా కోల్​కతా​, ముంబయి​ జట్ల మధ్య మ్యాచ్​ రసవత్తరంగా సాగింది. కోల్​కతా నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి.. 17.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి టార్గెట్ ఛేదించింది. 5 వికెట్ల తేడాతో కోల్​కతాపై విజయం సాధించింది. ఇషాన్​ కిషన్​ ధనాధన్​ ఇన్నింగ్స్​ ఆడి.. 25 బంతుల్లో హాఫ్​ సెచరీ పూర్తి చేశాడు. తిలక్​ వర్మ (30), రోహిత్​ శర్మ (20). సూర్య కుమార్​ యాదవ్ (43), టిమ్​ డేవిడ్​ (23) ఫర్వాలేదనిపించారు. కోల్​కతా బౌలర్లలో సుయాశ్​ శర్మ 2 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి, శార్దుల్​ ఠాకుర్, ఫర్గూసన్​ ఓక్కో వికెట్​ చొప్పున తీశారు.

అంతకుముందు.. టాస్​ ఓడిపోయి బ్యాటింగ్​కు చేసిన కోల్​కతా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కోల్​కతా బ్యాటర్​​ వెంకటేశ్​ అయ్యర్​​(104) శతక ప్రదర్శన చేశాడు. రింకూ సింగ్​(18), ఆండ్రూ రసెల్​ (21*) ఫర్వాలేదనిపించారు. జగదీశన్​ (0), నితీశ్​ రాణా (5), శార్దుల్​ ఠాకూర్​ (13), సునీల్ నరైన్ (2*) పేలవ ప్రదర్శన చేశారు. ఇక, ముంబయి బౌలర్లలో హృతిక్​ శోకీన్​ (2) వికెట్లు పడగొట్టాడు. కామెరూన్​ గ్రీన్, జాసెన్, పీయుశ్​ చావ్లా, మెరెడిత్ ఒక్కో వికెట్​ చొప్పున తీశారు.

రోహిత్​ శర్మ 'ఇంపాక్ట్​'..
అస్వస్థత కారణంగా ఈ మ్యాచ్​లో రోహిత్​ శర్మ ఆడటం లేదని.. తాత్కాలిక కెప్టెన్ సూర్య కుమార్​ యాదవ్​ చెప్పాడు. కానీ, అనూహ్యంగా రెండో ఇన్నింగ్స్​లో రోహిత్​ ఓపెనర్​గా దిగాడు. 13 బంతుల్లో 20 పరుగులు చేసి వెనుదిరిగాడు.

ఐపీఎల్​ తొలి కవలలు..
సౌతాఫ్రికాకు చెందిన మర్కో జాన్​సెన్, డ్యూన్​ జాన్​సెన్​.. ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​లో అరుదైన ఘనత సాధించారు. ఈ లీగ్​లో ఆడిన మొదటి కవలలుగా నిలిచారు. ముంబయి ఇండియన్స్​ ఇన్నింగ్స్​​ సందర్భంగా డ్యూన్‌ జాన్‌సెన్ తుది జట్టులో ఆడాడు. దీంతో ఈ ఘనత సాధించారు. అయితే ఈ మ్యాచ్​లో డ్యూన్​ కోల్​కతాకు భారీగా పరుగులు సమర్పించాడు. 4 ఓవర్లు వేసి 53 పరుగులు ఇచ్చాడు.
మార్కో జాన్​సెన్ విషయానికొస్తే.. ఈ ప్లేయర్​ ఇంతకుముందు ముంబయి ఇండియన్స్ జట్టు తరఫున ఆడాడు. ప్రస్తుతం సన్​రైజర్స్​ హైదరాబాద్​కు ఆడుతున్నాడు. ఇప్పటివరకు 12 మ్యాచ్​లు ఆడిన మార్కో 13 వికెట్లు తీశాడు. 28.62 సగటుతో.. 8.27 ఎకానమీ రేట్​తో.. ఐపీఎల్​ టాప్​ బౌలర్లలో ఒకడిగా ఉన్నాడు.

వెంకటేస్​ తొలి సెంచరీ..
వెంకటేశ్​ అయ్యర్​ ఎదురుచూపులకు తెర పడింది. ఐపీఎల్​లో తొలిసారి సెంచరీ బాదాడు. మెక్​ కల్లమ్​ తర్వాత కోల్​కతా నైట్​ రైడర్స్​ తరఫున శతక ప్రదర్శన చేసిన రెండో ప్లేయర్​గా నిలిచాడు. మెక్​ కల్లమ్​ ఐపీఎల్​ తొలి సీజన్​లో మొదటి మ్యాచ్​లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత సెంచరీ అనేది కోల్​కతా జట్టు డిక్షనరీలో కనుమరుగైంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత.. కోల్​కతా సెంచరీల కరవును తీర్చాడు వెంకటేశ్​.

Last Updated :Apr 16, 2023, 8:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.