ETV Bharat / sports

IPL 2022: ఐపీఎల్​లో అత్యధిక క్యాచ్​లు పట్టింది వీరే..

author img

By

Published : Mar 13, 2022, 2:33 PM IST

IPL 2022: క్రికెట్​ ఏ ఫార్మాట్​లోనైనా మ్యాచ్​ విజయంలో క్యాచ్​ది కీలక పాత్రే. ఆ ఒక్క క్యాచ్..​ ఓడిపోయే జట్టును గెలిపించగలదు, గెలుస్తుందనుకున్న జట్టును ఓడించగలదు. ముఖ్యంగా రసవత్తరంగా జరిగే టీ20లు, వన్డేల్లో ఫీల్డర్లు శరవేగంగా కదిలితేనే క్యాచ్​లను అందుకోగలరు. త్వరలోనే ఐపీఎల్​-15వ సీజన్​ దగ్గరపడుతున్న నేపథ్యంలో అత్యధిక క్యాచ్​లు పట్టిన ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం..

ipl
players who caught highest catches

IPL 2022: ఎంత అద్భుతంగా బౌలింగ్‌ చేసినా.. క్యాచ్​లను నేలపాలు చేస్తే కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. బౌండరీకి వెళ్లే బంతిని ఆపి ఒక్క పరుగే రానిస్తే.. అది సూపర్‌ ఫీల్డింగ్‌ అంటాం కదా.. అలానే దూరంగా, వేగంగా గాల్లోకి లేచిన బంతిని ఒడిసి పట్టుకుంటే సూపర్‌ క్యాచ్‌ అవుద్ది. ఒకే ఒక్క క్యాచ్‌తో మ్యాచ్‌ రూపురేఖలు మారిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ నెల 26న ఐపీఎల్​ 15వ సీజన్​ ఆరంభం కానున్న నేపథ్యంలో ఇప్పటివరకు లీగ్​ చరిత్రలో అత్యధిక క్యాచ్​లను పట్టిన ఆటగాళ్లు ఎవరో ఓ సారి చూద్దాం.

సురేష్​ రైనా..

భారత క్రికెట్​ చరిత్రలో గొప్ప ఫీల్డర్లలో ఒకడు సురేష్​ రైనా. ఐపీఎల్​లో 102 మ్యాచులు ఆడి 104 క్యాచులు పట్టాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు అత్యధిక క్యాచ్​లు పట్టిన ఆటగాడు రైనానే. ఐపీఎల్​లో సుదీర్ఘకాలం పాటు చెన్నై సూపర్​ కింగ్స్​ తరఫున ఆడిన రైనాను ఈ ఏడాది ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. అయితే ఈ సీజన్​​లో కొత్తగా చేరిన గుజరాత్​ టైటాన్స్ జట్టు ఆటగాడు జేసన్​రాయ్​ లీగ్​ మొదలవ్వకముందే వైదొలిగాడు. ఈ క్రమంలో ​రైనాను తీసుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఇటీవలే అఫ్గాన్​ ఆటగాడిని తీసుకుంటున్నట్లు గుజరాత్​ టైటాన్స్​ ప్రకటించింది.

IPL 2022
సురేష్ రైనా

కీరన్​ పొలార్డ్​..

పొడుగ్గా ఉండే ముంబయి ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ కీరన్​ పొలార్డ్..​ ఎక్కువగా లాంగ్‌ ఆన్‌, లాంగ్‌ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తుంటాడు. ఈ ఆటగాడు బౌండరీ లైన్ దగ్గరకి వచ్చిన ఏ క్యాచ్​ను వదలడు. ఎన్నో సార్లు బౌండరీలకు వెళ్లే బంతులను ఒంటిచేత్తో పట్టి ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్‌ చరిత్రలో పొలార్డ్‌ ఇప్పటివరకు 90 క్యాచ్​లు పట్టాడు.

IPL 2022
కీరన్​ పొలార్డ్​

రోహిత్​ శర్మ

ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్ రోహిత్ శర్మ ఎక్కువగా సర్కిల్ లోపల ఫీల్డింగ్‌ చేస్తుంటాడు. ఇప్పటి వరకు 207 ఐపీఎల్‌ మ్యాచులాడిన హిట్​మ్యాన్​ 89 క్యాచులను పట్టుకున్నాడు. ఇతని సారథ్యంలోనే ముంబయి ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచి రికార్డు సృష్టించింది.

IPL 2022
రోహిత్​ శర్మ

ఏబీ డివిలియర్స్

ప్రపంచవ్యాప్త ఉత్తమ ఫీల్డర్లలో దక్షిణాఫ్రికాకు చెందిన ఏబీ డివిలియర్స్‌ ఒకడు. ఐపీఎల్‌లో చాలాకాలంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఆడిన మిస్టర్​ 360.. ఈ లీగ్​లో 122 ఇన్నింగ్స్​ల్లో 83 క్యాచులు అందుకున్నాడు. గత సీజన్​తోనే తన ఐపీఎల్​ కెరీర్​కు కూడా రిటైర్మెంట్​ ఇచ్చాడు.

IPL 2022
ఏబీ డివిలియర్స్

శిఖర్​ ధావన్​

ఐపీఎల్‌లో దిల్లీ డేర్‌డేవిల్స్‌, ముంబయి ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్లకు ఆడిన శిఖర్​ ధావన్​.. 2019 నుంచి దిల్లీ క్యాపిటల్స్‌ ఆడాడు. 2022 సీజన్​ కోసం పంజాబ్​ అతడిని తీసుకుంది. ఇప్పటివరకు 184 ఇన్నింగ్స్​ల్లో ధావన్​ 81 క్యాచులను పట్టాడు.

IPL 2022
శిఖర్​ ధావన్​

ఇవీ చదవండి:

ఐపీఎల్​లో అత్యధికసార్లు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌' వీరికే..

IPL 2022: అత్యధిక వికెట్లు పడగొట్టిన వీరులు వీరే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.