ETV Bharat / sports

ఐపీఎల్ 2020: సీఎస్కే తడబాటుకు కారణం అదే?

author img

By

Published : Sep 27, 2020, 9:13 AM IST

Updated : Sep 27, 2020, 10:13 AM IST

ఐపీఎల్​-2020లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శనపై సామాజిక మాధ్యమాల వేదికగా అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ధోనీ వ్యూహాన్ని తప్పుబడుతూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​, వ్యాఖ్యాత ఆకాశ్​ చోప్రా స్పందించాడు. అత్యుత్తమ ఫ్రాంచైజీల్లో ఒకటిగా నిలుస్తూ వచ్చిన చెన్నై ఈ విధంగా పడిపోవడానికి గల కారణాలను విశ్లేషించాడు.

MS Dhoni
సీఎస్కే

ఈ ఏడాది ఐపీఎల్​లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ఫ్రాంచైజీ చెన్నై సూపర్​ కింగ్స్​. లీగ్ తొలి మ్యాచ్​లో విజయం సాధించినప్పటికీ.. ఆ తర్వాత రెండు మ్యాచ్​ల్లో వరుసగా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ విషయంపై భారత మాజీ బ్యాట్స్​మన్​, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్​ చోప్రా స్పందించాడు. ఇప్పటివరకు అత్యుత్తమ ఫ్రాంచైజీల్లో ఒకటిగా నిలుస్తూ వచ్చిన చెన్నై.. ఇలా డీలా పడిపోవడానికి గల కారణాలను విశ్లేషించాడు. టాపార్డర్ నుంచి ఆశించిన స్థాయిలో పరుగులు రాకపోవడం జట్టుకు ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నాడు. అలాగే జట్టులో ఐదుగురు బౌలర్లు మాత్రమే ఉండటాన్ని ధోనీ ఎప్పుడూ ఇష్టపడడని అన్నాడు.

"నాకు గుర్తున్నంతవరకు ధోనీ ఎప్పుడూ ఐదుగురు బౌలర్లతో ఐపీఎల్​ బరిలోకి దిగలేదు. ఇదే తొలిసారి. ఆ విధంగా చేయడం మహీకి కూడా ఇష్టం లేదు. తన బ్యాటింగ్​ గురించి కొంత ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. రాయుడు లేకపోవడం జట్టుకు పెద్ద లోపం. దీంతో పాటు మురళీ విజయ్​ సరిగ్గా ఆడకపోవడం, రుతురాజ్​ను చేర్చుకోవడం అంతా గందరగోళాన్ని సృష్టించింది. ఈ సీజన్​లో జడేజా బౌలింగ్​ గమనించినట్లైతే.. వేసే 4 ఓవర్లకు 40కిపైగా స్కోరు ఇస్తున్నాడు. అలా ఎక్కువ పరుగులు ఇస్తే జట్టుకు ఉచ్చు బిగించుకున్నట్లే."

-ఆకాశ్​ చోప్రా, భారత మాజీ క్రికెటర్​

ధోనీ డౌన్​ ఆర్డర్​లో రావడాన్ని పలువురు మాజీ క్రికెటర్లతో సహా అభిమానులూ తప్పుబట్టారు. అయితే మహీ అలా ఎందుకు చేస్తున్నాడో అర్థం చేసుకోగలనని ఆకాశ్​ పేర్కొన్నాడు.

"ధోనీ బ్యాటింగ్​ ఆర్డర్​ గురించి మాట్లాడేటప్పుడు.. రుతురాజ్​, మురళీ విజయ్​ ఎప్పుడు ఆడుతున్నారో ఓ సారి చూడాలి. చివర్లో జాదవ్​ను పంపించడం వల్ల ప్రయోజనం ఏంటని తెలుసుకోవాలి. ఈ విషయంలో ధోనీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. డుప్లెసిస్​ మినహా.. టాపార్డర్​ బ్యాట్స్​మన్​​ పరుగుల కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. షేన్​ వాట్సన్​ కూడా బాగా ఆడతాడు. అయితే నా ఆందోళనంతా విజయ్​, గైక్వాడ్ గురించే. జట్టులో రైనా, హర్భజన్​ సింగ్ లేకపోవడం పెద్ద లోటు. ఇటువంటి పరిస్థితిల్లో చెన్నై 180 స్కోరును ఛేదించడమంటే సవాలే. ధోనీ కచ్చితంగా ఆరుగురు బౌలర్లను తీసుకోవడం మంచిదని నా అభిప్రాయం" అని ఆకాశ్​ చెప్పాడు.

Last Updated : Sep 27, 2020, 10:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.