ETV Bharat / sports

టీమ్‌ఇండియా స్లిప్‌ కార్డన్‌లో ఎవరు బెస్ట్‌ అంటే?

author img

By

Published : Jun 10, 2023, 12:31 PM IST

india cricket team slip fielders : టెస్టు క్రికెట్‌లో కీలకమైన స్లిప్‌ కార్డన్‌ గురించి అడిగితే ఛాట్‌జీపీటీ సమాధానమిచ్చింది. టీమ్​ఇండియాలో స్లిప్​ ఫీల్డర్లుగా ఎవరెవరు సరైనా వారో వివరించింది.

Teamindia slip cordon as per chatgpt
టీమ్‌ ఇండియా స్లిప్‌ కార్డన్‌లో ఎవరు బెస్ట్‌?

india cricket team slip fielders : టెస్టు క్రికెట్​లో ట్రైన్​ పొజిషన్​లో నిలబడే స్లిప్‌ ఫీల్డర్లు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లాంగ్ ఫార్మాట్​లో ఈ స్లిప్​ ఫీల్డింగ్​ ఎంతో కీలకం. దీనిని స్లిప్‌ కార్డన్‌ అని పిలుస్తారు. బంతిని సంధించడానికి బౌలర్‌ పరుగు ప్రారంభించగానే.. ఎడ్జ్‌ తీసుకొని వచ్చే క్యాచ్‌ల కోసం స్లిప్​లో ఉన్న ప్లేయర్సంతా రెడీగా ఉంటారు. అసలీ ఫీల్డింగ్​ చేయడానికి స్టార్‌ ఆటగాళ్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ప్రత్యేకంగా ప్రాక్టీస్‌ కూడా చేస్తుంటారు. మరి ఈ ఫీల్డింగ్‌ ప్లేస్‌లో టీమ్​ఇండియాలో ఎవరు ఉంటే బాగుంటుందో సమాధానం చెప్పింది ఛాట్‌జీపీటీ. వారెందుకు ఈ స్లిప్​ ఫీల్డింగ్​లో ఉండాలో కూడా వివరించింది.

  • విరాట్‌ కోహ్లీ.. బ్యాటింగ్‌లో పరుగుల వరద పారింటే విరాట్‌ కోహ్లీ.. స్లిప్‌ ఫీల్డింగ్‌లో కూడా చురుగ్గా ఉంటాడు.
  • అజింక్య రహానె.. టీమ్​ఇండియాలో స్లిప్‌ కార్డన్‌ రెగ్యులర్‌ ఫీల్డర్‌ల జాబితాలో అజింక్య రహానె పేరు కచ్చితంగా ఉంటుంది. మ్యాచుల్లోని కీలక సందర్భాల్లో క్యాచులు అందుకుని చాలా సార్లు గెలిపించాడు.
  • ఛెతేశ్వర్‌ పుజారా.. క్రీజులో గంటల తరబడి ఉండి బ్యాటింగ్‌ చేసేది.. టీమ్​ఇండియాలో ఛెతేశ్వర్‌ పుజారా. అతడికి స్లిప్‌ ఫీల్డర్‌కు ఉన్న లక్షణాలు బాగా ఉన్నాయి. టెక్నిక్‌, ఏకాగ్రత అతడిలో ఎక్కువగా ఉన్నాయి. అదే అతడిని బెస్ట్‌ స్లిప్‌ ఫీల్డర్‌ను చేసింది.
  • రోహిత్‌ శర్మ.. టీమ్‌ ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. బంతిని గమనించి వేగంగా రియాక్ట్‌ అవ్వగలడు. బంతిని అందుకోవడంలో చూపించే అతడి బాడీ లాంగ్వేజ్‌.. ఈ జాబితాలోకి తీసుకొచ్చింది.
  • శిఖర్‌ ధావన్‌.. టీమ్​ఇండియా విదేశాల్లో పర్యటించేటప్పుడు.. బెస్ట్‌ స్లిప్‌ ఫీల్డర్‌ అంటే శిఖర్‌ ధావన్‌. అక్కడి పిచ్‌లకు శిఖర్‌ స్లిప్‌ ఫీల్డింగ్‌ సరిగ్గా సరిపోతుంది. గతంలో విదేశీ గడ్డపై ఆడన సిరీస్‌ల్లో శిఖర్‌ మంచి క్యాచ్​లను అందుకున్నాడు.

ఇక టీమ్​ఇండియా విషయానికొస్తే.. ప్రస్తుతం ఓవల్​ స్టేడియం వేదికగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్​ 2023(డబ్ల్యూటీసీ) ఫైనల్​ ఆడుతోంది. మొదటి రెండు రోజుల ఆటతో పోలిస్తే.. మూడో రోజు టీమ్​ఇండియా కాస్త పర్వాలేదనిపించే ప్రదర్శన చేసింది. అయినప్పటికీ మూడు రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియానే పైచేయి సాధించింది. 296 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఆ జట్టు.. నాలుగు రోజు ఆటలో కూడా చెలరేగి 400 పరుగుల టార్గెట్​ను నిర్దేశించేలా కనిపిస్తోంది. ఈ ఛేదన భారత్‌కు కఠిన సవాల్​ లాంటిది. ఎందుకంటే..

Oval highest Run Chase In Tests : ఓవల్‌ స్టేడియం రికార్డులను ఓ సారి చూస్తే.. చివర్లో అద్భుతాలను చేసిన జట్టే గెలిచాయి. అందులోనూ ఈ మైదానంలో అత్యధిక ఛేదన ఇప్పుటివరకు 263 మాత్రమే. అది కూడా 121 ఏళ్ల కిందట జరిగిన మ్యాచ్​లో ఈ ఛేదన నమోదైంది. ఇందులో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్‌ గెలిచింది. చూడాలి మరి ఇప్పుడు జరుగుతున్న డబ్ల్యూటీసీలో ఏం జరుగుతుందో..

ఇదీ చూడండి :

WTC Final 2023 : టీమ్​ఇండియాకు ఇక కష్టమే.. 104 టెస్టుల్లో 26 సార్లు మాత్రమే అలా!

క్రికెట్​ లవర్స్​కు గుడ్​న్యూస్​.. 'డిస్నీ+ హాట్‌స్టార్‌'లో ఫ్రీగా ఆసియా కప్​, వరల్డ్​ కప్​ మ్యాచ్​లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.