ETV Bharat / sports

మూడో వన్డేలో కీలక క్యాచ్​- సాయికి 'ఫీల్డర్‌' మెడల్​- ఆ పాట కోసం రాహుల్​, కేశవ​ ముచ్చట్లు!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2023, 4:08 PM IST

IND Vs SA 3rd ODI Impact Fielder
IND Vs SA 3rd ODI Impact Fielder

IND Vs SA 3rd ODI Impact Fielder : దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అరంగేట్రం చేసిన యంగ్​ ప్లేయర్​ సాయి సుదర్శన్​కు ఇంపాక్ట్‌ ఫీల్డర్ మెడల్‌ దక్కింది. మరోవైపు, రాహుల్​- కేశవ మహరాజ్ మాటలు సోషల్​మీడియాలో వైరల్​గా మారాయి.

IND Vs SA 3rd ODI Impact Fielder : దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల్ సిరీస్​లో టీమ్​ఇండియా అదరగొట్టింది. 2-1 తేడాతో సిరీస్​తో కైవసం చేసుకుంది. అయితే ఈ సిరీస్​లో అత్యుత్తమ ఫీల్డింగ్ ప్రదర్శన చేసిన ఆటగాడిని ఇంపాక్ట్ ఫీల్డర్​ మెడల్​తో టీమ్​ఇండియా మేనేజ్​మెంట్​ సత్కరించింది. ఈ అరుదైన గౌరవం యంగ్ క్రికెటర్ సాయి సుదర్శన్​కు దక్కింది.

అయితే ఈ మెడల్​ కోసం టీమ్​ఇండియా స్టాండింగ్ కెప్టెన్ కేఎల్ రాహుల్, యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్​, సంజూ శాంసన్ మధ్య తీవ్రపోటీ నెలకొంది. మూడో వన్డే మ్యాచ్​లో అద్భుతమైన క్యాచ్‌ పట్టిన సాయి సుదర్శన్​వైపే ఫీల్డింగ్‌ కోచ్ రాత్రా మొగ్గు చూపాడు. కాగా, ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్ ఆరు క్యాచ్‌లు అందుకున్నాడు. సంజూ శాంసన్​ కూడా రెండు క్యాచ్‌లు పట్టాడు. కానీ సాయి సుదర్శన్‌ చివరి మ్యాచ్‌లో కీలకమైన క్యాచ్‌ పట్టాడని. అందుకే మిగతా ఇద్దరిని కాదని అతడికే మెడల్‌ ఇస్తున్నట్లు రాత్రా వెల్లడించాడు.

  • 𝗗𝗿𝗲𝘀𝘀𝗶𝗻𝗴 𝗥𝗼𝗼𝗺 𝗕𝗧𝗦 | 𝗜𝗺𝗽𝗮𝗰𝘁 𝗙𝗶𝗲𝗹𝗱𝗲𝗿 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗢𝗗𝗜 𝗦𝗲𝗿𝗶𝗲𝘀

    A 2⃣-1⃣ ODI series win in South Africa 🏆👌

    Any guesses on who won the Impact fielder of the series medal? 🏅😎

    WATCH 🎥🔽 #TeamIndia | #SAvINDhttps://t.co/z92KREno0C

    — BCCI (@BCCI) December 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో సాయి సుదర్శన్​ అంతర్జాతీయ క్రికెట్​లోకి అడుగుపెట్టారు. టీమ్​ఇండియా తరఫున ఇంటర్నేషనల్​ క్రికెట్​లోకి అడుగుపెట్టిన 400వ ఆటగాడిగా నిలిచాడు. అయితే ఈ సిరీస్​లో సాయి సుదర్శన్​ 127 పరుగులు సాధించాడు. భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇందులో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో రెండోసారి వన్డే సిరీస్‌ను నెగ్గిన రెండో భారత కెప్టెన్‌గానూ కేఎల్ రాహుల్‌ అవతరించాడు. 2017/18 సీజన్‌లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమ్‌ఇండియా సిరీస్‌ను సొంతం చేసుకుంది.

రాహుల్- కేశవ్​ మాటలు వైరల్​!
మరోవైపు, మూడో వన్డేలో టీమ్​ఇండియా నిర్దేశించిన 297 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా వరుస వికెట్లను కోల్పోయింది. దీంతో ఆర్ డౌన్​లో కేశవ్ మహరాజ్ బ్యాటింగ్​కు వచ్చాడు. ఆ సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో 'రామ్‌ సీతా రామ్‌' అనే పాట ప్లే అయింది.

అప్పుడు వికెట్‌ కీపర్‌గా ఉన్న కేఎల్ రాహుల్ స్పందించాడు. "మీరు క్రీజ్‌లోకి వచ్చినప్పుడు ఆ పాట వస్తోంది" అంటూ చిరునవ్వులు చిందించాడు. దానికి సమాధానంగా కేశవ్‌ "అవును. నేను ఎప్పుడు వచ్చినా డీజే ప్లే అవుతుంది" అని బదులిచ్చాడు. వీరిద్దరు మాట్లాడుకున్న మాటలు స్టంప్స్‌ మైక్‌లో రికార్డయ్యాయి. అవి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తొలుత బౌలింగ్‌ చేయడానికి కేశవ్ మహరాజ్‌ వచ్చినప్పుడూ ఇదే పాట వచ్చింది.

'నా కష్టం మీకు తెలియదు, తెలుగు కుర్రాడు అదుర్స్'- రాహుల్, అర్షదీప్ రికార్డులే రికార్డులు!

'మా కుర్రాళ్లకు ఇచ్చిన మెసేజ్‌ అదే- అందుకే సంజుకు అప్పట్లో ఛాన్సులు రాలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.