ETV Bharat / sports

ఫస్ట్ మ్యాచ్​లోనే సాయి సుదర్శన్‌ రికార్డులు​- రాహుల్ ఖాతాలో ఎవరికీ సాధ్యం కాని ఘనత!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 18, 2023, 7:20 AM IST

IND Vs SA 1st ODI Records
IND Vs SA 1st ODI Records

IND Vs SA 1st ODI Records : దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమ్​ఇండియా అదరగొట్టేసింది. అయితే ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తమిళనాడు యువ ఆటగాడు సాయి సుదర్శన్‌ దుమ్మురేపాడు. మరోవైపు, భారత క్రికెట్ జట్టు తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు.

IND Vs SA 1st ODI Records : మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా జొహనెస్‌బర్గ్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు తమిళనాడు యువ ఆటగాడు సాయి సుదర్శన్‌. అయితే అరంగేట్రం మ్యాచ్‌లోనే అతడు అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో యంగ్ క్రికెటర్​ రుతురాజ్‌ గైక్వాడ్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగాడు సుదర్శన్‌. 43 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 55 పరుగులు చేసి టీమ్​ఇండియాను విజయతీరాలకు చేర్చాడు.

నాలుగో ఆటగాడిగా
Sai Sudharsan Record : అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీ సాధించిన టీమ్​ఇండియా నాలుగో ఆటగాడిగా రికార్డుకెక్కాడు. రాబిన్‌ ఉతప్ప (2006లో ఇంగ్లాండ్‌పై 86 పరుగులు), కేఎల్‌ రాహుల్‌ (2016లో జింబాబ్వేపై 100 నాటౌట్‌), ఫయాజ్‌ ఫజల్‌ (2016లో జింబాబ్వేపై 55 నాటౌట్‌) తర్వాత అరంగేట్రంలో హాఫ్‌ సెంచరీ సాధించిన ప్లేయర్​గా నిలిచాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మరోవైపు, వన్డే డెబ్యూలో ఓపెనర్​గా 50 ప్లస్‌ స్కోర్‌ సాధించిన 17వ భారత ఆటగాడిగా రి​కార్డుల్లోకెక్కాడు. 2022 ఐపీఎల్​ సీజన్‌తో గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున ఐపీఎల్‌ అరంగేట్రం చేసి 22 ఏళ్ల సాయి సుదర్శన్‌ అద్భుతంగా రాణించాడు. రెండు సీజన్లలో 13 మ్యాచ్‌లు ఆడి నాలుగు హాఫ్​సెంచరీల సాయంతో 46.09 సగటున 507 పరుగులు సాధించాడు.

కేఎల్ రాహుల్ ఘనత
Kl Rahul Record Against South Africa : సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్​ఇండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కేఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనత సాధించాడు. తొలి వన్డేలో సఫారీలను చిత్తుగా ఓడించడం ద్వారా పింక్‌ వన్డే (సౌతాఫ్రికా ఆటగాళ్లు పింక్‌ కలర్‌ జెర్సీలతో ఆడే మ్యాచ్‌లు) గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఏ భారత కెప్టెన్‌ దక్షిణాఫ్రికాలో పింక్‌ వన్డే గెలవలేదు.

  • CAPTAIN KL RAHUL CREATED HISTORY...!!!!

    - He becomes the first Indian captain to win the Pink ODI match in South Africa. 🇮🇳 pic.twitter.com/hGpMQmUDYD

    — Johns. (@CricCrazyJohns) December 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అర్ష్​దీప్​ సింగ్​ సరికొత్త చరిత్ర
Arshdeep Singh Record :ఈ మ్యాచ్​లోనే టీమ్​ఇండియా పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో దక్షిణాఫ్రికాపై ఆ దేశంలో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి భారత పేసర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అర్ష్‌దీప్‌కు ముందు సౌతాఫ్రికాపై పలువురు భారత బౌలర్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసినా వాళ్లంతా స్పిన్నర్లే కావడం గమనార్హం.

India Vs South Africa ODI 2023 : మ్యాచ్ విషయానికొస్తే- సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది భారత్​. అర్ష్‌దీప్‌ (10-0-37-5), ఆవేశ్‌ ఖాన్‌ (8-3-27-4) విజృంభించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా 116 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత్‌ 16.4 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. సాయి సుదర్శన్‌ (55 నాటౌట్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (52) భారత్‌ను గెలిపించారు. ఈ గెలుపుతో భారత్‌ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. రెండో వన్డే డిసెంబర్‌ 19న జరగనుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

టెస్ట్ సిరీస్​ నుంచి తప్పుకున్న ఇషాన్- సౌతాఫ్రికా టూర్ నుంచి రిటర్న్

రోహిత్ కెప్టెన్సీలో స్టార్లుగా మారిన క్రికెటర్లు- పాండ్యనే ఫస్ట్!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.