ETV Bharat / sports

Ind vs Ban World Cup 2023 : భారత్Xబంగ్లాదేశ్ పోరు.. 'రివెంజ్'​కు టీమ్ఇండియా రెడీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2023, 8:03 PM IST

Updated : Oct 18, 2023, 8:12 PM IST

Ind vs Ban World Cup 2023 : ప్రస్తుత వరల్డ్​కప్​లో సంచలనాల పరంపర కొనసాగుతోంది. ఇటీవల డిఫెండింగ్ ఛాంపియన్​ ఇంగ్లాండ్​కు పసికూన అఫ్గానిస్థాన్ షాకిచ్చింది. తాజాగా టోర్నీలోనే చిన్న జట్టైన నెదర్లాండ్స్.. సౌతాఫ్రికాపై ఆల్​రౌండ్ ప్రదర్శన కనబర్చి అద్భుత విజయం నమోదు చేసింది. అయితే సంచలనాలకు మారుపేరైన బంగ్లాదేశ్ కూడా గురువారం జరిగే మ్యాచ్​లో భారత్​పై ఇలాంటి విజయం నమోదు చేస్తుందా? అని సగటు క్రికెట్ అభిమానుల్లో సందేహం కలుగుతోంది.

Ind vs Ban World Cup 2023
Ind vs Ban World Cup 2023

Ind vs Ban World Cup 2023 : 2023 ప్రపంచకప్​లో భాగంగా భారత్.. అక్టోబర్ 19 గురువారం పుణె వేదికగా బంగ్లాదేశ్​తో తలపడనుంది. ఈ మెగాటోర్నీలో గత రెండు మ్యాచ్​ల్లో ఓటమి చవిచూసిన బంగ్లా.. ఈ మ్యాచ్​​తోనైనా గెలుపు బాట పట్టాలని చూస్తోంది. అయితే అది అంత సులభం కాదని బంగ్లాకు కూడా తెలుసు. కానీ, 2023 ఆసియా కప్​లో టీమ్ఇండియాపై విజయం సాధించడం వల్ల వారి ఆత్మవిశ్వాసం పెరిగిందనడంలో సందేహం లేదు. ఇక ఈ వరుసగా మూడు మ్యాచ్​ల్లో నెగ్గిన భారత్.. గురువారం నాటి మ్యాచ్​లోనూ గెలిచి సెమీస్​కు మరింత చేరువవ్వాలని ఆశిస్తోంది.

అత్యంత పటిష్ఠంగా భారత్.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్​మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్​తో బ్యాటింగ్‌ విభాగం భీకరంగా ఉంది. ఆల్​రౌండర్లు హార్దిక్‌, రవీంద్ర జడేజా బౌలింగ్​తో పాటు బ్యాటింగ్​లోనూ రాణించగలిగే సత్తా ఉన్నవాళ్లే. గత మూడు మ్యాచ్​ల్లోనూ వీరిద్దరూ జట్టుకు అవసరమైనప్పుడల్లా వికెట్ తీసి బ్రేక్ ఇచ్చారు. ముఖ్యంగా గత మ్యాచ్​లో పాకిస్థాన్​పై.. హార్దిక్ మంత్రం చదివి వికెట్ తీసిన తీరు నెట్టింట తెగ వైరలైంది. ఇక బౌలర్లు బుమ్రా, సిరాజ్‌, కుల్‌దీప్‌ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్​లో ఉన్న విషయం తేలిసిందే..

బంగ్లాను తేలిగ్గా తీసుకోలేం.. క్రికెట్​లోకి చిన్న జట్టుగా ఎంట్రీ ఇచ్చిన బంగ్లాదేశ్.. ఇప్పటికే అనేక సంచలన విజయాలు నమోదు చేసింది. బంగ్లా, భారత్​ను సైతం పలుమార్లు ఓడించి ఝలక్ ఇచ్చింది. రీసెంట్​గా 2023 ఆసియా కప్​ సూపర్ 4లోనూ భారత్​పై బంగ్లాదేశ్ నెగ్గింది. ఈ మ్యాచ్​ సహా గత నాలుగు వన్డేల్లో భారత్‌పై బంగ్లాదేశ్‌దే పైచేయి. కానీ, అప్పుడు టీమ్ఇండియా ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగింది. ఇక ప్రస్తుతం ఆ జట్టులో ఎలాంటి సమయంలోనైనా ప్రత్యర్థి జట్లకు షాక్‌ ఇవ్వగలిగే ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా కెప్టెన్ షకిబ్‌ అల్ హసన్‌తో పాటు ముష్ఫికర్ రహీమ్‌, పేసర్ ముస్తాఫిజర్, తస్కిన్ అహ్మద్ కీలకంగా మారారు. కాబట్టి బంగ్లాతో పోరులో అలసత్వం ప్రదర్శించకూడదు.

భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్, బుమ్రా, సిరాజ్, షమీ/శార్దూల్‌ ఠాకూర్

Icc Odi Mens Ranking 2023 : వన్డే ర్యాంకింగ్స్​ రిలీజ్​.. టాప్​ 10లోకి రోహిత్.. విరాట్ ర్యాంక్​ ఎంతంటే ?

Asia Cup 2023 IND Vs BAN : ఆసక్తికర పోరులో బంగ్లాదే విజయం.. గిల్, అక్షర్ పోరాటం వృథా

Last Updated : Oct 18, 2023, 8:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.