ETV Bharat / sports

Asia Cup 2023 IND Vs BAN : ఆసక్తికర పోరులో బంగ్లాదే విజయం.. గిల్, అక్షర్ పోరాటం వృథా

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 11:09 PM IST

Updated : Sep 16, 2023, 7:51 AM IST

Asia Cup 2023 IND Vs BAN : 2023 ఆసియా కప్​ సూపర్ 4లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ తలపడ్డాయి. మ్యాచ్ ఆసాంతం ఆసక్తికరంగా సాగిన పోరులో బంగ్లాదేశ్​ విజయం సాధించింది.

Asia Cup 2023 IND Vs BAN : ఆసక్తికర పోరులో బంగ్లాదే విజయం.. గిల్, అక్షర్ పోరాటం వృథా
Asia Cup 2023 IND Vs BAN : ఆసక్తికర పోరులో బంగ్లాదే విజయం.. గిల్, అక్షర్ పోరాటం వృథా

Asia Cup 2023 IND VS BAN : 2023 ఆసియా కప్​లో​ భారత్ తొలి ఓటమిని చవిచూసింది. బంగ్లాతో ఆసక్తిగా సాగిన నామమాత్రపు పోరులో ఆరు పరుగుల తేడాతో ఓడింది. గిల్‌(121; 133 బంతుల్లో 8×4, 5×6) అద్భుత పోరాటం చేసినా వృథా అయింది. దీంతో బంగ్లా విజయం సాధించింది.

266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్​ఇండియాలో ఇతర బ్యాటర్ల నుంచి ఎలాంటి సహకారం రాకపోయినా.. గిల్​ మాత్రం అద్భుత సెంచరీతో టీమ్‌ఇండియాను గెలిపించడానికి విశ్వప్రయత్నం చేశాడు. అక్షర్‌ పటేల్‌(42; 34 బంతుల్లో 3×4, 2×6) కూడా చివర్లో గొప్పగా పోరాడాడు. కానీ ఛేదనలో టీమ్​ఇండియా కొద్ది దూరంలో ఆగిపోయింది. ఓపెనర్​ రోహిత్ శర్మ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇక తిలక్​ వర్మ, ఇషాన్ కిషన్, జడేజా​ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. కేఎల్ రాహుల్​ (19), సూర్యకుమార్​ యాదవ్ (26), అక్షర్ పటేల్ ఫర్వాలేదనిపించారు. దీంతో భారత్​.. 49.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో ముస్తఫిజుర్‌ 3 వికెట్లు పడగొట్టగా... అరంగేట్ర బౌలర్‌ తన్‌జీమ్, మెహదీ హసన్‌ చెరో 2 వికెట్లు తీశారు. ఇకపోతే ఈ మ్యాచ్​లో కోహ్లీ, బుమ్రా, హార్దిక్‌, సిరాజ్‌, కుల్‌దీప్‌లకు విశ్రాంతి నిచ్చారు. తిలక్‌ వర్మ, షమి, సూర్యకుమార్‌, శార్దూల్‌, ప్రసిద్ధ్‌ కృష్ణలకు అవకాశమిచ్చారు. ఈ మ్యాచ్‌తోనే తిలక్‌ వన్డే అరంగేట్రం చేశాడు. కానీ ఇతడు తన అరంగేట్ర మ్యాచ్​లోనే నిరాశపరిచాడు. కాగా, టీమ్‌ఇండియా ఆదివారం జరిగే ఫైనల్లో శ్రీలంకతో తలపడనుంది.

ఇకపోతే అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన బంగ్లాదేశ్​ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. షకీబ్​ (80; 85 బంతుల్లో 6×4, 3×6) కెప్టెన్ ఇన్సింగ్స్​ ఆడి అదరగొట్టాడు. హృదయ్​ (54; 81 బంతుల్లో 5×4, 2×6)​ హాఫ్​ సెంచరీతో రాణించగా.. నసుమ్​ అహ్మద్​ (44*; 45 బంతుల్లో 6×4, 1×6), మెహెది హసన్ (29*) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకుర్ 3 వికెట్లు పడగొట్టాడు. షమీ రెండు వికెట్లు తీయగా.. ప్రసిద్​, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.

Asia Cup 2023 IND Vs BAN : ఖాతా తెరవకుండానే పెవిలియన్​కు రోహిత్.. అరంగేట్రంలో నిరాశపర్చిన తెలుగు కుర్రాడు

World Cup 2023 Semi Final Tickets : క్రికెట్ ఫ్యాన్స్​కు అలర్ట్.. ఫైనల్ మ్యాచ్​ టికెట్ల సేల్​ స్టార్ట్​.. మీరు రెడీనా?

Last Updated : Sep 16, 2023, 7:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.