ETV Bharat / sports

ప్రాక్టీస్​ సెషన్​లో కనిపించని కోహ్లీ.. అందరీ దృష్టి ఆ బంగ్లా ప్లేయర్​పైనే..

author img

By

Published : Dec 21, 2022, 1:15 PM IST

బంగ్లాతో మొదటి పోరులో విజయం సాధించిన టీమ్​ ఇండియా రెండో టెస్ట్​ కోసం సిద్ధమవుతోంది. అయితే ఈ మ్యాచ్​ మొదటి సెషన్‌కు భారత  స్టార్‌ విరాట్‌ కోహ్లీ గైర్హాజరయ్యాడు. ఎందుకంటే

ind-vs-ban
ind-vs-ban-kohli-misses-

బంగ్లాదేశ్‌పై తొలి టెస్టులో విజయం సాధించిన టీమ్​ఇండియా.. రెండో టెస్టు కోసం సన్నద్ధమవుతోంది. అయితే ఈ మ్యాచ్​ మొదటి సెషన్‌కు భారత స్టార్‌ విరాట్‌ కోహ్లీ గైర్హాజరయ్యాడు. అయితే కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ మాత్రం నెట్స్‌లో చెమటోడ్చుతూ కనిపించారు. కాగా, తొలి మ్యాచ్‌లో విఫలమైన ఓపెనర్‌ రాహుల్‌(22, 23 పరుగులు) కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పర్యవేక్షణలో తన టెక్నిక్‌ను మెరుగుపరచుకునే పనిలో పడ్డాడు. రాహుల్‌ బ్యాటింగ్‌ను దగ్గరుండి పర్యవేక్షించిన ద్రవిడ్‌.. లోపాలు సరిదిద్దుతూ.. మెళకువలు నేర్పాడు.

అదే విధంగా మొదటి టెస్టులో రాణించిన పుజారా, శుబ్‌మన్‌ గిల్‌ సైతం ఈ ప్రాక్టీస్​ సెషన్‌లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి.అర్జెంటీనా జెర్సీతో సెలబ్రేషన్స్​.. ఇక బంగ్లాదేశ్‌ జట్టు కూడా ప్రాక్టీసు సెషన్‌లో పాల్గొంది. అయితే ఈ సెషన్​లో కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ అర్జెంటీనా జెర్సీ ధరించి ఫుట్‌బాల్‌ ఆడుతూ కనిపించాడు.

కాగా ఫిఫా వరల్డ్‌కప్‌-2022 ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించి మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఆనందాన్ని ఇలా సెలబ్రేట్‌ చేసుకుంది షకీబ్‌ బృందం. కాగా, మీర్పూర్‌ వేదికగా బంగ్లాదేశ్‌- టీమ్​ఇండియా రెండో టెస్టు గురువారం ప్రారంభంకానుంది. ఇక ఈ టెస్టుకు కూడా రెగ్యులర్‌ కెప్టెన్ రోహిత్‌ శర్మ దూరమయ్యాడు. దీంతో రాహుల్‌ స్టాండ్​ బై కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.