ETV Bharat / sports

వారు నన్ను ఎందుకు వెంబడించారో.. షాక్​ అయ్యా: సూర్యకుమార్​ యాదవ్​

author img

By

Published : Dec 21, 2022, 10:46 AM IST

టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్​ సూర్యకుమార్​ యాదవ్​ తన లైఫ్​లో జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ గురించి చెప్పాడు. ఆ సంగతులు..

Suryakumar yadav star status life
వారు నన్ను ఎందుకు వెంబడించారో.. షాక్​ అయ్యా: సూర్యకుమార్​ యాదవ్​

వన్డేలు, టీ20 ఫార్మాట్‌లో సూపర్​ ఫామ్‌తో ఫుల్​ జోష్​లో ఉన్నాడు టీమ్‌ఇండియా బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్‌. అయితే ఆటగాడిగా మారాక తన జీవితంలో వచ్చిన మార్పులను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. పేరు, ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా తానేమీ మారలేదని తెలిపాడు. అయితే కుటుంబంతో కలిసి కొన్ని పనులు చేయలేని పరిస్థితి వచ్చిందన్నాడు.

"నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు నన్ను అనుసరిస్తున్నారు. ఇది నాకు కొత్తగా ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో భారతీయ అభిమానులను కలిశా. సింగపూర్‌లో ఓ జంట నన్ను చూసి 'సూర్యకుమార్‌.. ఎలా ఉన్నారు' అని అరిచింది. నేను షాక్‌ అయ్యాను. వారు వెనకాలే వచ్చేశారు. నేనేం చేశాను? వారిలా ఎందుకు చేస్తున్నారని ఆశ్చర్యపోయాను. నేను ఇక నా ఫ్లైట్‌ని అందుకోవడానికి పరిగెత్తాను. నేను ముందు ఎలా ఉన్నానో ఇప్పుడూ అలానే ఉన్నాను. కానీ నా టైం మారింది. నాతో ప్రయాణం చేయడం అంత సులభం కాదని నా కుటుంబానికి అర్థమైంది. ఇది వరకు కుటుంబమంతా కలిసి సినిమాలకు, విందులకు వెళ్లే వాళ్లం. కుటుంబంతో వెళ్లడం నాకు చాలా నచ్చేది. కానీ ఇప్పుడు వాటికి పరిమితులున్నాయి" అని వెల్లడించాడు.

కాగా, ఐపీఎల్​లో తన అద్భుత ప్రదర్శనతో ఫుల్​ క్రేజ్ దక్కించుకున్నాడు సూర్యకుమార్​. కోల్‌కతా తరఫున ఆడే సమయంలో అతడికి మంచి గుర్తింపు వచ్చింది. ముంబయి తరఫున ఆడేటప్పుడు గొప్ప టీ20 బ్యాటర్‌గా నిలిచాడు. 2021లో అంతర్జాతీ క్రికెట్​లోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి ప్రపంచవ్యాప్తంగా సూపర్​ క్రేజ్​ను అందుకున్నాడు. దాంతో ప్రపంచ క్రికెట్‌లో అతని స్థాయి అనూహ్యంగా పెరిగింది. టీ20 ప్రపంచకప్‌ సమయంలో అద్భుతంగా రాణించాడు. మహమ్మద్‌ రిజ్వాన్‌, బాబర్‌ అజామ్‌లను అధిగమించి బ్యాటర్‌గా టీ20 ర్యాంకింగ్‌లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

ఇదీ చూడండి: ఆ ఫుట్​బాల్​ సంబరం భారత్​కు ఎప్పుడు..? సాకర్​ అర్హత సాకారమయ్యేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.