ETV Bharat / sports

PAK vs BAN WORLD CUP 2023 : పుంజుకున్న పాకిస్థాన్​.. బంగ్లాదేశ్​పై ఘన విజయం

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2023, 8:37 PM IST

Updated : Oct 31, 2023, 8:47 PM IST

PAK vs BAN WORLD CUP 2023 : 2023 ప్రపంచ కప్​లో భాగంగా మంగళవారం బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​లో 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్​ గెలిచింది. 2023 వరల్డ్​కప్​ టోర్నీలో మూడో విజయం నమోదు చేసింది.

PAK vs BAN WORLD CUP 2023
PAK vs BAN WORLD CUP 2023

PAK vs BAN WORLD CUP 2023 : 2023 వరల్డ్​కప్​లో భాగంగా మంగళవారం కోల్​కతాలోని ఈడెన్​ గార్డెన్స్​ స్టేడియంలో బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​లో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్​ 204 పరుగులు చేసి కుప్ప కూలింది. 205 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన.. మొదటి నుంచీ​ నిలకడగా ఆడుతూ 32.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్​ను ఛేదించింది. ఓపెనర్లు అబ్దుల్ షఫీక్​ (68), ఫకర్ జమాన్ (81) చెలరేగి ఆడి జట్టు మంచి ఆరంభాన్నిచ్చారు. వన్​డౌన్​ వచ్చిన బాబర్ అజామ్​ (9) పరుగులకే పెవిలియన్ చేరాడు. మహ్మద్ రిజ్వాన్ (26*), ఇఫ్తికర్ అహ్మద్ (17*) పరుగులు చేశారు. ఇక బంగ్లా బౌలర్లలో మెహెదీ హసన్ మిరాజ్ 3 వికెట్లు​ తీశాడు.

అంతకుముందు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టు.. 45.1 ఓవర్లలో 204 పరుగులకు కుప్పకూలింది. మహ్మదుల్లా (56; 79 బంతుల్లో 6x4, 1x6) టాప్​ స్కోరర్​గా నిలిచాడు. లిట్టన్ దాస్‌ (45; 64 బంతుల్లో 6x4), షకీబ్ అల్ హసన్ (43; 64 బంతుల్లో 4x4) రాణించారు. మెహది హసన్ మిరాజ్ (25) పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. తాంజిద్ హసన్ (0), నజ్ముల్ హొస్సేన్ శాంటో (4), ముష్పీకర్ రహీమ్ (5), తౌహిద్‌ హృదౌయ్‌ (7), ముఫ్తికర్‌ రెహ్మాన్‌ (3) సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరారు. పాక్‌ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, మహ్మద్‌ వసీమ్‌ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. హారిస్ రవూఫ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. ఉసామా మీర్, ఇఫ్తికార్ అహ్మద్‌ తలో వికెట్ తీశారు.

విమర్శల మధ్య మూడో విజయం..
ప్రస్తుత వరల్డ్​ కప్​లో పాకిస్థాన్​ ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక పాక్​ క్రికెట్​లో ముసలం మొదలైంది. ఈ క్రమంలో పాక్​ మూడో విజయం సొంతం చేసుకుంది. ఇప్పటివరకు 7 మ్యాచ్​లు ఆడిన పాక్​.. మూడింట్లో గెలిచి పాయంట్ల పట్టిలో ఐదో స్థానంలో నిలిచింది.

Pakistan Team Kolkata Biryani : హోటల్‍లో డిన్నర్​కు పాక్​ టీమ్​ నో.. 'జామ్​ జామ్​'లో బిర్యానీ ఆర్డర్!

Virat Kohli ODI Century Record : నేను ఇన్ని సెంచరీల​ చేస్తాననుకోలేదు.. ఇలాంటివి ఎవరూ ప్లాన్​ చేయరు : కోహ్లీ

Last Updated : Oct 31, 2023, 8:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.