ETV Bharat / sports

Ind vs Pak T20: 'విజయాన్ని నిర్ణయించేది నాయకత్వమే'

author img

By

Published : Oct 22, 2021, 5:32 AM IST

ind vs pak
భారత్, పాకిస్థాన్

భారత్, పాకిస్థాన్ టీ20 మ్యాచ్​(Ind vs Pak T20) త్వరలోనే జరగనున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్(Matthew Hayden on India) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ విజయాన్ని నిర్ణయించేది కెప్టెన్ సారథ్యం వహించిన తీరే అని అన్నాడు.

టీ20 ప్రపంచకప్​(T20 World Cup 2021) సందర్భంగా.. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్​ మ్యాచ్​(Ind vs Pak Match) మరో మూడు రోజుల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్(Mattew Hayden on India) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ హై ఓల్టేజీ మ్యాచ్​లో.. కెప్టెన్ తన జట్టుకు నాయకత్వం వహించిన తీరే విజయంలో కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్​ 2021లో(IPL 2021) ఎంఎస్ ధోనీ, ఇయాన్ మోర్గాన్​ పరుగులు చేయడంలో విఫలమైనప్పటికీ జట్టును బాగా నడిపించారని గుర్తుచేశాడు.

"ధోనీ, మోర్గాన్​ వ్యక్తిగతంగా ఎక్కువ పరుగులు చేయడంలో విఫలమయ్యారు. గతంతో పోల్చితే ఈ సీజన్​లో వాళ్లు చేసిన పరుగులు చాలా తక్కువ. కానీ, జట్టును ఫైనల్​ వరకు తీసుకువెళ్లడంలో వారు సఫలం అయ్యారు. యూఏఈలో ఉన్న పరిస్థితుల్లో కెప్టెన్ తీసుకునే నిర్ణయాలే జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తాయని నా అభిప్రాయం."

-మాథ్యూ హేడెన్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు.

మరింత ఒత్తిడి..

బ్యాటింగ్​లో రాణిస్తూ.. జట్టుకు సారథ్యం వహించడం పాకిస్థాన్​ జట్టు సారథి బాబర్ అజామ్​పై(Babar Azam News) ఒత్తిడి పెంచే అంశమని హేడెన్ అభిప్రాయపడ్డాడు. అందరి దృష్టి బాబర్​పైనే ఉంటుందని తెలిపాడు.

అయితే.. టీమ్​ఇండియా బ్యాట్స్​మన్ కేఎల్​ రాహుల్ పాకిస్థాన్​ జట్టుకు ప్రమాదకరమైన ఆటగాడని హేడెన్​ పేర్కొన్నాడు. టీ20ల్లో రాహుల్ ఆధిపత్యం చెలాయిస్తున్నాడని తెలిపాడు.

ఇదీ చదవండి:

టీమ్ఇండియానే టైటిల్ ఫేవరెట్: ఇంజమామ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.