ETV Bharat / sports

IPL 2022: డిఫరెంట్​గా గుజరాత్​ జట్టు​ లోగో ఆవిష్కరణ

author img

By

Published : Feb 20, 2022, 6:07 PM IST

Gujarat Titans Logo
Gujarat Titans Logo

Gujarat Titans Logo: ఈ ఏడాది ఐపీఎల్​లో అరంగేట్రం చేయనున్న గుజరాత్​ టైటాన్స్(జీటీ)​ కొత్త ట్రెండ్​ సెట్​ చేసింది. మెటావర్స్​లో తమ జట్టు లోగోను ఆవిష్కరించింది. ఇప్పటివరకు ఏ జట్టు చేయని ప్రయోగం చేసి.. అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.

Gujarat Titans Logo: 2022 ఐపీఎల్​లో ప్రవేశించనున్న రెండు కొత్త జట్లలో ఒకటైన గుజరాత్​ టైటాన్స్​(జీటీ) తమ జట్టు లోగోను ఆదివారం ఆవిష్కరించింది. ఐపీఎల్​లో ఇప్పటివరకు ఏ జట్టు చేయని విధంగా మెటావర్స్​లో జట్టు లోగో ఆవిష్కరించి కొత్త ట్రెండ్​ సెట్​ చేసింది. వర్చువల్​ వరల్డ్​ అనుభూతిని పొందేందుకు ఈ ప్రయోగం చేసి.. ఐపీఎల్​ సీజన్​ ప్రారంభానికి ముందే అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. 'ది టైటాన్స్​ డగౌట్​' పేరుతో ఉన్న ఈ వర్చువల్​ స్పేస్​లోనే లోగోను ఆవిష్కరించింది. అందులో జట్టు కోచ్​ ఆశిష్​ నెహ్రా, కెప్టెన్​ హార్దిక్​ పాండ్య, శుభ్​మన్​ గిల్​లు కనిపించారు.

సీవీసీ గ్రూప్​.. అహ్మదాబాద్​ జట్టును రూ.5625 కోట్లకు కొనుగోలు చేసింది. అహ్మదాబాద్​ జట్టుకు 'గుజరాత్ టైటాన్స్' అని పేరు పెట్టారు.

గుజరాత్ టైటాన్స్.. ప్రీ ఆక్షన్​లో హార్దిక్ పాండ్య-రూ.15 కోట్లు, రషీద్ ఖాన్- రూ.15 కోట్లు, శుభ్​మన్ గిల్- రూ.8 కోట్లకు సొంతం చేసుకుంది. వీరితో పాటు జేసన్​ రాయ్​, మాథ్యూ వేడ్​, డేవిడ్​ మిల్లర్​, మహ్మద్​ షమి, ల్యూకీ ఫెర్గూసన్​ వంటి నాణ్యమైన ఆటగాళ్లను ఎంపిక చేసింది. రాహుల్​ తెవాటియా, సాయి కిషోర్​, అభినవ్ మనోహర్‌ వంటి ప్రతిభావంతులైన భారత అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ల కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసింది.

భారత మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా.. గుజరాత్ టైటాన్స్​ జట్టుకు హెడ్​కోచ్​గా వ్యవహరించనున్నాడు. 2011 వన్డే ప్రపంచకప్​ గెలవడంలో కీలకపాత్ర పోషించిన మాజీ కోచ్ గ్యారీ కిర్​స్టన్.. మెంటార్, బ్యాటింగ్ కోచ్​గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

ఇదీ చూడండి: ఆఖరి మ్యాచ్​లో శ్రీలంక విజయం.. సిరీస్ కంగారూలదే​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.