ETV Bharat / sports

స్పిన్నర్ డిఫరెంట్ బౌలింగ్ యాక్షన్ - చూస్తే నవ్వు ఆపుకోలేరు -నెట్టింట వీడియో వైరల్

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2023, 2:46 PM IST

Updated : Nov 25, 2023, 4:14 PM IST

Funny Bowling Action : లోకల్ క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్​ ఆడుతున్న ఓ స్పిన్నర్.. తన బౌలింగ్ యాక్షన్​తో నవ్వులు పూయించాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. అతడి బౌలింగ్ మీరూ చూసేయండి.

funny bowling action
funny bowling action

Funny Bowling Action : క్రికెట్​లో ఒక్కో బౌలర్​కు ఒక్కో యాక్షన్ ఉంటుంది. లైన్ అండ్ లెంగ్త్​ సరిగ్గా రాబట్టేందుకు డిస్టెన్స్​ ఎక్కువగా తీసుకొని బౌలింగ్ చేసేవారు కొందరైతే.. టెక్నిక్​​తో డిఫరెంట్ యాక్షన్​తో బంతి సంధించే వారు ఇంకొందరు. అలా ఇప్పటివరకు క్రికెట్​లో లసిత్ మలింగ, శివిల్ కౌశిక్, సోహైల్ తన్వీర్ డిఫరెంట్​ యాక్షన్​తో బౌలింగ్ చేసేవారే. అయితే వీళ్లను మించిన బౌలింగ్ యాక్షన్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

అయితే లోకల్ క్లబ్​ మ్యాచ్​ ఆడుతున్న ఓ స్పిన్నర్.. వింతగా బౌలింగ్ చేశాడు. అతడి బౌలింగ్ స్టైల్ సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది. ఇప్పటివరకు క్రికెట్​లో ఎవరూ చేయని విధంగా రెండు చేతులు తిప్పుకుంటూ.. బౌలింగ్ చేస్తూ బ్యాటర్​ను తికమక పెడుతున్నాడు. ఆ బౌలర్ తన యాక్షన్​తో బౌలింగ్ చేస్తే.. కన్య్ఫూజన్​లో బ్యాటర్ క్రీజులో నుంచి తప్పుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో అతడి బౌలింగ్ యాక్షన్​పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు..'చైనామెన్ తర్వాత ఇప్పుడు ఆక్వామెన్ వచ్చాడు', 'స్విమ్మర్ కావాలనుకుంటే.. పేరెంట్స్ బలవంతంగా క్రికెట్​లో చేర్పించారు', 'హర్భజన్​ యాక్షన్​కు 5 రేట్లు స్పీడ్' అంటూ కామెంట్ చేస్తున్నారు.

క్రికెట్​లో మరికొన్ని ఫన్నీ బౌలింగ్ యాక్షన్లు..

కెవిన్ కొతిగొడ (శ్రీలంక).. 2018 అండర్ 19 ఆసియా కప్​లో, శ్రీలంక ఆర్థోడాక్స్ బౌలర్ వింతగా బౌలింగ్ చేశాడు. అతడి స్ట్రైల్ విచిత్రంగా ఉందని అప్పట్లో తెగ కామెంట్ చేశారు. మీరూ ఓసారి ఆ విడియో చూసేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పాల్ ఆడమ్స్ (సౌతాఫ్రికా).. సౌతాఫ్రికా మాజీ స్పిన్నర్ పాల్ ఆడమ్స్.. జంప్ చేస్తూ బౌలింగ్ చేస్తాడు. అతడి డిఫరెంట్​ యాక్షన్​కు బ్యాటర్లు కాస్త తికమక పడేవారు. ఆడమ్స్ తన కెరీర్​లో 69 అంతర్జాతీయ మ్యాచ్​లు ఆడాడు. అందులో మొత్తంగా 163 వికెట్లు పడగొట్టాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కేదార్ జాదవ్ (భారత్).. టీమ్ఇండియా ఆల్​రౌండర్ కేదార్ జాదవ్.. తన బౌలింగ్ యాక్షన్​ పట్ల పలు విమర్శలు ఎదుర్కొన్నాడు. ఐసీసీ కూడా తన యాక్షన్​ను మార్చకోమని ఒకట్రెండు సార్లు హెచ్చరించింది.

క్రికెటర్ల గాయాలు.. ప్రమాదంలో కెరీర్లు!

జాదవ్​ను వదిలేస్తున్న సీఎస్కే!

Last Updated :Nov 25, 2023, 4:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.