ETV Bharat / sports

యూఏఈలో అడుగుపెట్టిన మూడు ఐపీఎల్​ జట్లు...

author img

By

Published : Aug 20, 2020, 9:51 PM IST

ipl 13 season news
యూఏఈలో అడుగుపెట్టిన మూడు ఐపీఎల్​ జట్లు...

ఐపీఎల్​ 13వ సీజన్​ కోసం ఆటగాళ్లు తమ ఫ్రాంఛైజీలతో కలిసి యూఏఈలో అడుగుపెట్టారు. ప్రత్యేక విమానాల్లో ఆతిథ్య దేశానికి చేరుకున్నారు. కింగ్స్​ ఎలెవెన్​ పంజాబ్​, రాజస్థాన్​ రాయల్స్​, కోల్​కతా నైట్​రైడర్స్​ గురువారం యూఏఈ చేరుకున్నట్లు ఆయా యాజమాన్యాలు వెల్లడించాయి.

ఈ ఏడాది ఐపీఎల్​కు నెల రోజుల సమయం కూడా లేదు. అందుకే మెగాటోర్నీ కోసం జట్లన్నీ తగు జాగ్రత్తలు పాటిస్తూ ఆతిథ్య దేశానికి చేరుకుంటున్నాయి. ఆగస్టు 20న కింగ్స్​ ఎలెవెన్​ పంజాబ్​, రాజస్థాన్​ రాయల్స్​, కోల్​కతా నైట్​రైడర్స్​ యూఏఈలో కాలుమోపాయి. సెప్టెంబర్​ 19 నుంచి లీగ్​ ప్రారంభం కానుంది.

రాజస్థాన్​ రాయల్స్​, కింగ్స్​ ఎలెవెన్​ పంజాబ్​ జట్లు ప్రత్యేక విమానాల్లో దుబాయ్​ చేరుకోగా.. కోల్​కతా నైట్​రైడర్స్​ అబుదాబిలో దిగింది. ఆయా ఫ్రాంఛైజీలు తమ ఆటగాళ్ల ఫొటోలను షేర్​ చేశాయి. క్రికెటర్లకు మాస్కులు, శానిటైజర్లనే కాకుండా పీపీఈ కిట్లు కూడా అందించారు.

పర్యటనకు ముందే ఆటగాళ్లందరికీ కొవిడ్​-19 టెస్టులు చేశారు. అంతేకాదు యూఏఈలో మరో ఆరు రోజులు అందరూ ఐసోలేషనలో ఉండనున్నారు. ఈ సమయంలో మూడుసార్లు కరోనా పరీక్షలు చేయనున్నారు. వీటన్నింటిలో నెగిటివ్​ వచ్చిన వాళ్లే బయోబబుల్​లో అడుగుపెట్టనున్నారు. ఆ తర్వాత శిక్షణలో పాల్గొంటారు.

టోర్నీ సమయంలోనూ ఆటగాళ్లు సహా సిబ్బందికి ప్రతి ఐదురోజులకు ఒకసారి వైద్య పరీక్షలు చేయనున్నారు.

శుక్రవారానికి మరిన్ని...

ముంబయి ఇండియన్స్​, చెన్నై సూపర్​కింగ్స్​, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్లు శుక్రవారం యూఏఈలో అడుగుపెట్టనున్నాయి. సన్​రైజర్స్​​ హైదరాబాద్​, దిల్లీ క్యాపిటల్స్​ జట్లు వారాంతరంలో ఆతిథ్య దేశానికి చేరుకోనున్నాయి.

53 రోజుల్లో 60 మ్యాచ్​లు నిర్వహించనున్నారు. దుబాయ్​, షార్జా, అబుదాబి వేదికల్లో మ్యాచ్​లు జరగనున్నాయి. 2014లో భారత్​లో ఎన్నికల సమయంలో యూఏఈలోనే కొన్ని మ్యాచ్​లు నిర్వహించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.