ETV Bharat / sports

సచిన్​, కోహ్లీకి లేని రికార్డ్​.. శ్రేయస్ సొంతం​​

author img

By

Published : Nov 15, 2020, 2:20 PM IST

దిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​ అరుదైన ఘనత సాధించాడు. అయితే క్రికెట్​లో కాకుండా ఇన్​స్టాగ్రామ్​లో ఈ రికార్డు నెలకొల్పాడు. సచిన్, ధోనీ వంటి భారత క్రికెట్​ దిగ్గజాలు సాధించలేని ఘనతను ఈ యువహిట్టర్ సొంతం చేసుకున్నాడు. అసలింతకీ అతడేం సాధించాడంటే..

Shreyas Iyer leaves Sachin Tendulkar behind, matches Virat Kohli in social media for THIS reason
సచిన్​, కోహ్లీని వెనక్కు నెట్టి ఇన్​స్టాలో అదరగొట్టిన శ్రేయస్​

క్రికెట్​ దిగ్గజం సచిన్​ తెందూల్కర్​, టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీలకు ట్విట్టర్​, ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​లలో విపరీతమైన ఫాలోయింగ్​ ఉంది. సామాజిక మాధ్యమాల్లో వాళ్ల పోస్టులకు అంతే స్థాయిలో లైక్​లు, కామెంట్లు వస్తుంటాయి. కానీ ఈ ఇరువురు సాధించలేని ఓ అరుదైన ఘనతను.. యువ హిట్టర్​, దిల్లీ క్యాపిటల్స్​ జట్టు కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​ సొంతం చేసుకున్నాడు.

ఒకే ఒక్కడు..

సామాజిక మాధ్యమం ఇన్​స్టాగ్రామ్​నకు 'ఇన్​స్టా​'లో ఓ​ అధికారిక ఖాతా ఉంది. అది కేవలం ఓ 60 మందిని మాత్రమే అనుసరిస్తోంది. అందులో శ్రేయస్​ అయ్యర్​ చోటు దక్కించుకోవడం విశేషం. భారత్​ నుంచి ఇన్​స్టా.. అనుసరిస్తున్న ఒకే ఒక్క క్రీడాకారుడు శ్రేయస్​. ఐపీఎల్​లో శ్రేయస్​ అద్భుతమైన ప్రదర్శన కారణంగానే ఇన్​స్టాగ్రామ్​ అతడి ఖాతాను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​కు నాయకత్వం వహించిన శ్రేయస్​ అయ్యర్​.. ఈ సీజన్​లో 500 పరుగులు సాధించాడు. లీగ్​ చరిత్రలో తొలిసారి ఫైనల్​కు చేరిన దిల్లీ జట్టు.. ముంబయితో తలపడి రన్నరప్​గా నిలిచింది.

ఇదీ చూడండి:'సరైన వ్యక్తితో నిర్బంధంలో సమయాన్ని గడుపుతున్నా!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.