ETV Bharat / sports

'నాలుగో స్థానానికి శ్రేయస్ అయ్యర్ సరైన ఎంపిక'

author img

By

Published : Aug 12, 2019, 4:45 PM IST

Updated : Sep 26, 2019, 6:35 PM IST

టీమిండియా జట్టులో నాలుగో స్థానానికి శ్రేయస్​ అయ్యర్​ సరైనవాడని అభిప్రాయపడ్డాడు భారత మాజీ క్రికెటర్ సునీల్​ గావస్కర్​. విండీస్​తో రెండో వన్డేలో వచ్చిన అవకాశాన్ని ​సద్వినియోగపరుచుకున్నాడని వ్యాఖ్యానించాడు దిగ్గజ క్రికెటర్​.

'నాలుగో స్థానానికి శ్రేయస్ అయ్యర్ సరైన ఎంపిక'

వెస్టిండీస్​తో ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్​పై ప్రశంసలు కురిపించాడు మాజీ క్రికెటర్ గావస్కర్. నాలుగో స్థానంలో పంత్​ కంటే మెరుగైన ఆటగాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఎప్పటి నుంచి భారత్​ జట్టును వేధిస్తోన్న మిడిలార్డర్​ సమస్యను శ్రేయస్​ భర్తీ చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Shreyas Iyer better for No. 4 spot, should get permanent slot in ODIs: Gavaskar
పంత్​, శ్రేయస్​ అయ్యర్​

"శ్రేయస్​ అయ్యర్ తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. విరాట్​ కోహ్లీతో అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పాడు. మ్యాచ్​ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా యువ బ్యాట్స్​మెన్ రిషభ్​ పంత్​కు ఫినిషర్​ బాధ్యతలు అప్పగిస్తే సహజ సిద్ధంగా ఆడేందుకు ప్రయత్నిస్తాడు. టీమిండియా టాప్​ ముగ్గురు ఆటగాళ్లు 40-45 ఓవర్లపాటు ఆడితే.. తర్వాత బ్యాటింగ్​కు పంత్​ వస్తే బాగుంటుంది. అదే వారు త్వరగా పెవిలియన్​ చేరితే నాలుగో స్థానంలో శ్రేయస్ సరైన ప్రత్యామ్నాయం" .

- సునీల్ గావస్కర్, మాజీ క్రికెటర్

ఈ మ్యాచ్​లో 59 పరుగుల తేడాతో గెలిచింది టీమిండియా. 120 పరుగులతో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆకట్టుకోగా.. 71 పరుగులతో విజయంలో తన వంతు పాత్ర పోషించాడు శ్రేయస్ అయ్యర్.

రెండో వన్డే జరిగిన వేదికలోనే తర్వాతి మ్యాచ్​ ఆడనుంది కోహ్లీసేన. 14వ తేదీన జరిగే ఈ పోరులో గెలిస్తే సిరీస్​ టీమిండియా సొంతం అవుతుంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Barcelona - 12 August 2019
++NIGHT SHOTS++
1. Various of lightning strikes, torrential rain and thunderstorms
STORYLINE:
Officials in the Spanish region of Catalonia said Monday they are on flood alert after an intense thunderstorm hit overnight.
Catalonia's weather service registered over 1,400 lightning bolts hitting the ground and the highest level of precipitation in the town of Cunit with 6,2mm accumulated in one minute.
The rains caused flooding of houses and stores as well as disruptions in the train routes and streets due to fallen trees.
Despite the disruptions and intensity of the storm no injuries were reported as of yet.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 26, 2019, 6:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.