ETV Bharat / sports

'ఆడనని ధోనీ నాకు ముందే చెప్పాడు'

author img

By

Published : May 3, 2020, 1:46 PM IST

Mahi didn't want to play : Former BCCI chief selector MSK Prasad finally opens up about MS Dhoni's Team india exclsion
'ధోని తన ఇష్టంతోనే క్రికెట్​కు దూరంగా ఉన్నాడు'

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ తీసుకున్న తాత్కాలిక విరామం గురించి తనకు ముందే తెలుసని చెప్పాడు మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్. అతడి నిర్ణయం వల్లే పంత్​కు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నాడు.

గతేడాది వార్షిక కాంట్రాక్ట్​ల జాబితాను టీమిండియా ప్రకటించగానే అందరూ ఆశ్చర్యపోయారు. అందులో ధోనీ పేరు లేదేంటా అని చర్చించుకున్నారు. అతడు రిటైర్మెంట్​ తీసుకునేందుకు సిద్ధమయ్యాడని భావించారు. అందుకు తగ్గట్లుగానే వన్డే ప్రపంచకప్​ తర్వాత నుంచి మహీ, ఆటకు దూరంగా ఉండటం వల్ల ఈ వ్యాఖ్యలకు బలం చేకూరింది. తాజాగా ఇదే విషయమై మాట్లాడిన బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.. క్రికెట్​ నుంచి ధోనీ ఇష్టప్రకారమే తప్పుకున్నాడని, ఇది తనకు ముందే తెలుసని పేర్కొన్నాడు.

"ఈ విషయంపై చాలా స్పష్టంగా ఉన్నాను. అతడితో చర్చలు కూడా జరిపాం. కొంతకాలం పాటు క్రికెట్​కు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు ధోనీ నాతో చెప్పాడు. అందుకే అతడి స్థానంలో యువ వికెట్​కీపర్​ రిషభ్​ పంత్​కు అవకాశం కల్పించాం" -ఎమ్మెస్కే ప్రసాద్​, సెలక్షన్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌

ధోనీ తర్వాత వికెట్​కీపర్​గా జట్టులోకి వచ్చిన పంత్​.. ఆశించినమేర ప్రదర్శన కనబర్చలేకపోయాడు. దీనితో పాటే గాయాలు, అతడిని మరింత ఇబ్బంది పెట్టాయి. తద్వారా కేఎల్​ రాహుల్​కు కీపర్​గా అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఆ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తున్న రాహుల్.. బ్యాటింగ్​లోనూ అదరగొడుతున్నాడు. దీంతో ​సెలక్టర్లు... ధోనీ ఎంపిక విషయంలో పునరాలోచనలో పడ్డారు.

ఇంగ్లాండ్‌లో గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌ సెమీస్​లో చివరగా ఆడిన ధోనీ.. ఆ తర్వాత క్రికెట్​కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. ఈ ఏడాది ఐపీఎల్​​లో చెలరేగి, జాతీయ జట్టులో తిరిగి చోటు దక్కించుకోవాలని భావించాడు. కానీ కరోనా ‌ప్రభావంతో టోర్నీని నిరవధిక వాయిదా వేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.