ETV Bharat / sports

'బుట్టబొమ్మ' పాటకు పీటర్సన్ స్టెప్పులు

author img

By

Published : May 13, 2020, 1:50 PM IST

ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్​ 'బుట్టబొమ్మ' సాంగ్​కు డ్యాన్స్ చేశాడు. టిక్​టాక్​లో అల్లు అర్జున్ స్టెప్పులను అనుకరిస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.

పీటర్సన్
పీటర్సన్

సోషల్ మీడియాలో 'బుట్టబొమ్మ' సాంగ్ హవా నడుస్తోంది. ముఖ్యంగా టిక్​టాక్​లో ప్రపంచవ్యాప్తంగా ఈ పాటకు అభిమానులున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్​ తన కుటుంబంతో కలిసి ఈ పాటకు స్టెప్పులేశాడు. అది కాస్త విశేషాదరణ పొందింది. తాజాగా ఇదే పాటకు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ చిందేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

అల్లు అర్జున్ వేసిన హుక్ స్టెప్​ను అనుకరించడానికి పీటర్సన్ ప్రయత్నించాడు. ఆ స్టెప్పులు చూసి ప్రేక్షకుల ముఖంపై నవ్వులు పూస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్​చల్​ చేస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.