ETV Bharat / sports

టెస్టు ర్యాంకింగ్స్: నాలుగుకు పడిపోయిన కోహ్లీ.. పుజారా@7

author img

By

Published : Jan 20, 2021, 1:16 PM IST

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్​లో టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ మరో స్థానం కోల్పోయి నాలుగో ర్యాంకుకు చేరుకున్నాడు. విలియమ్సన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలింగ్​ విభాగంలో బుమ్రా పది నుంచి తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు.

kohli
కోహ్లీ

అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ) మంగళవారం టెస్టు క్రికెట్​ ర్యాంకింగ్స్​ విడుదల చేసింది. బ్యాట్స్​మెన్ విభాగంలో విరాట్ కోహ్లీ మళ్లీ ఓ స్థానం కోల్పోయి నాలుగో ర్యాంకుకు చేరుకున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో డబుల్​ సెంచరీతో మెరిసిన ఇంగ్లాండ్​ సారథి జో రూట్​ ఆరు స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ మొదటి స్థానాన్ని, ఆసీస్​ స్టార్​ స్మిత్​ రెండో స్థానాన్ని కాపాడుకున్నారు. లబుషేన్​ (ఆసీస్​) ఓ స్థానం మెరుగుపరుచుకుని మూడో ర్యాంకుకు ఎగబాకాడు.​

ప్రస్తుతం విలియమ్సన్ 919 పాయింట్లతో ఉండగా, స్మిత్ 891, లబుషేన్​ 878, కోహ్లీ 862 పాయింట్లతో కొనసాగుతున్నారు. అలాగే టీమ్​ఇండియా ఆటగాళ్లు పుజారా ఒకస్థానం మెరుగుపర్చుకుని 7వ స్థానానికి చేరగా రహానె రెండు స్థానాలు కోల్పోయి 9కి పడిపోయాడు.

బౌలింగ్​ విభాగంలో..

ఓ స్థానం మెరుగుపరుచుకుని టీమ్​ఇండియా క్రికెటర్ అశ్విన్​ 760 పాయింట్లతో 8, 757 పాయింట్లతో బుమ్రా 9వ ర్యాంకుకు చేరుకున్నారు. కమిన్స్​(ఆసీస్​), బ్రాడ్​(ఇంగ్లాండ్​), వాగ్నర్​(న్యూజిలాండ్​) వరుసగా టాప్​-3లో ఉన్నారు.

ఆల్​రౌండ్​ విభాగంలో..

ఓ స్థానం కోల్పోయి 419 పాయింట్లతో జడేజా మూడో స్థానానికి దిగజారగా.. ఓ స్థానాన్ని మెరుగుపరుచుకుని 281 పాయింట్లతో ఆరో ర్యాంకుకు చేరుకున్నాడు అశ్విన్​. ఇంగ్లాండ్​ క్రికెటర్​ బెన్​ స్టోక్స్​ 436 పాయింట్లతో అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. వెస్డిండీస్​ టెస్టు సారథి జాసన్​ హోల్డర్​ 423 పాయింట్లతో రెండో ర్యాంకుకు వచ్చాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.