ETV Bharat / sports

ఐపీఎల్: గేల్​ను ఇప్పట్లో ఎవరైనా దాటగలరా?​

author img

By

Published : Sep 4, 2020, 9:39 AM IST

Updated : Sep 4, 2020, 9:45 AM IST

Chris Gayle miles ahead in list of top six hitters in IPL, Virat Kohli not in top five
క్రిస్​ గేల్​

ఐపీఎల్​ అంటేనే హార్డ్​ హిట్టింగ్​కు పెట్టింది పేరు. అలాంటి టోర్నీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన వారిలో క్రిస్ గేల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడు నెలకొల్పిన ఆ సిక్సర్ల రికార్డును ఇప్పట్లో ఏ క్రికెటర్​ అయినా దాటగలడా?

ఐపీఎల్ అంటే ఓ మజా. ఐపీఎల్ అంటే ఓ ఆనందం. బ్యాట్స్​మెన్ కొట్టే సిక్సుల కోసమే ఈ లీగ్​ను చాలా మంది చూస్తారు! అలాంటిది ఈ టోర్నీలో సిక్సులు వర్షం కురిపించిన వారిలో విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ ముందున్నాడు. దుబాయ్ వేదికగా జరగబోయే కొత్త సీజన్​ కోసం అంతే ఉత్సాహంతో సిద్ధమవుతున్నాడు. అందుకోసం కసరత్తులు కూడా చేస్తున్నాడు. అయితే ఐపీఎల్​లో అత్యధిక సిక్సర్లు కొట్టిన తొలి ఐదుగురు బ్యాట్స్​మెన్ ఎవరు? అగ్రస్థానంలో ఉన్న గేల్​ను అందుకోవడం లేదా అధిగమించడం ఇతర క్రికెటర్లకు ఇప్పట్లో సాధ్యమయ్యే పనేనా?

ఐపీఎల్​లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వారిలో, తొలి రెండు స్థానాల్లో విదేశీ ఆటగాళ్లే ఉండటం విశేషం. టాప్​లో ఉన్న క్రిస్​ గేల్​కు రెండో స్థానంలో ఉన్న డివిలియర్స్​కు 114 సిక్సర్ల అంతరం ఉంది. ఈ సీజన్​లో అన్ని సిక్సులు కొట్టి గేల్​ను దాటటం ఏబీకి దాదాపు అసాధ్యం. మరి ఏమవుతుందో చూడాలి.

ఐపీఎల్​లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్​మెన్

1) క్రిస్​ గేల్​ - 124 ఇన్నింగ్స్​లో 326 సిక్సర్లు

2) ఏబీ డివిలియర్స్​ - 142 ఇన్నింగ్స్​లో 212 సిక్సర్లు

3) మహేంద్ర సింగ్ ధోనీ - 170 ఇన్నింగ్స్​లో 209 సిక్సర్లు

4) రోహిత్​ శర్మ - 183 ఇన్నింగ్స్​లో 194 సిక్సర్లు

5) సురేశ్ రైనా - 189 ఇన్నింగ్స్​లో 194 సిక్సర్లు

దుబాయ్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్-13 ప్రారంభం కానుంది. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న కారణంగా భారత్​లో నిర్వహించాల్సిన టోర్నీని, అరబ్ దేశంలో బయో బబుల్ వాతావరణంలో జరపనున్నారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఆటగాళ్లు ప్రాక్టీసులో మునిగితేలుతున్నారు. ​

Last Updated :Sep 4, 2020, 9:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.