ETV Bharat / sports

వరల్డ్ కప్​ ముందు టీమ్​ఇండియాకు గుడ్ న్యూస్.. ఆ సిరీస్​తో బుమ్రా రీఎంట్రీ!

author img

By

Published : Jun 18, 2023, 10:52 PM IST

Bumrah injury status : గాయంతో బుమ్రా దూరమైనప్పటి నుంచి టీమ్​ఇండియా పేస్ దళంలో పదును తగ్గింది. వరల్డ్​ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లోనూ భారత్ ఓటమితో బుమ్రా లేనిలోటు స్పష్టంగా కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మంచి వార్త బయటకు వచ్చింది. స్పీడ్ గన్ బుమ్రా.. రీఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు సమాచారం అందింది.

Bumrah
వరల్డ్ కప్​ ముందు టీమ్​ఇండియాకు గుడ్ న్యూస్.. ఆ సిరీస్​తో బుమ్రా రీఎంట్రీ!

Bumrah injury status : టీమ్​ఇండియాకు అలాగే అభిమానులకు గుడ్​ న్యూస్​ అందింది. ఐసీసీ ఈవెంట్లతో పాటుగా కీలక మ్యాచ్‌ల్లో బోల్తా కొడుతున్న భారత టీమ్‌కు ఊపిరి నిచ్చే వార్త ఇది. గాయం కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన స్పీడ్ గన్ బుమ్రా.. రీఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలిసింది. రీసెంట్​గా ఈ స్పీడ్​స్టర్​ న్యూజిలాండ్‌లో స‌ర్జ‌రీ చేయించుకున్నాడు.

ireland team vs india : ఆ సిరీస్​తో ఎంట్రీ.. ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్​ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. ​ ఈ నేపథ్యంలో టీమ్​ఇండియా పేస్ బౌలింగ్ అటాక్‌ అభిమానులకు కలవరపెడుతోంది. అయితే ఇప్పుడు తాజాగా అందిన వార్తతో అభిమానుల్లో జోష్​ పెరిగింది. ఎందుకంటే ఆగస్టులో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా టీమ్ ఇండియా.. ఐర్లాండ్ పర్యాటనకు వెళ్లనుంది. ఆగ‌స్టు 18, 20, 23వ తేదీల్లో ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్​లోకి బుమ్రా పునరాగమనం చేయనున్నాడని ఓ బీసీసీఐ అధికారి చెప్పినట్లు ఇంగ్లీష్ కథనాలు వస్తున్నాయి. ఐర్లాండ్‌తో సిరీస్ ద్వారా బుమ్రా ఫిట్‌నెస్​పై ఓ అంచనాకు రావొచ్చని మేనేజ్​మెంట్​ భావిస్తోందట. "అన్నీ స‌వ్యంగా జ‌రిగితే బుమ్రా పూర్తి ఫిట్‌నెస్‌తో మైదానంలో బరిలోకి దిగుతాడు. ఐర్లాండ్ సిరీస్‌కు అత‌డు అందుబాటులో ఉంటాడు" అని బీసీసీఐ అధికారి చెప్పారట. కాగా, ప్రస్తుతం బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో వీవీఎస్ లక్ష్మణ్, నితిన్ పటేల్ పర్యవేక్షణలో బుమ్రా ఉన్నాడట.

Bumrah injury News : అప్పటి నుంచి దూరం.. వెన్నునొప్పి కారణంగా గతేడాది సెప్టెంబర్ నుంచి జట్టుకు దూరమయ్యాడు బుమ్రా. గాయం కార‌ణంగా ఈ స్పీడ్​స్టర్​ గ‌తేడాది ఆసియా క‌ప్‌కు దూర‌మ‌య్యాడు. గాయం తిర‌గబెట్ట‌డం వల్ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్, శ్రీ‌లంక‌, న్యూజిలాండ్ సిరీస్‌ల‌తో పాటు బోర్డ‌ర్ గావ‌స్కర్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్​ మ్యాచులు ఆడలేదు. దీంతో భారత జట్టు బౌలింగ్ బలహీనంగా మారింది. కీలక మ్యాచ్‌లలో టీమ్​ఇండియా ఓటములను అందుకుంది.

వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో కీలకం.. ఈ ఏడాది జ‌రిగే వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో బుమ్రా కీల‌కం కానున్నాడు. ఈలోగా అత‌డు పూర్తి ఫిట్‌నెస్ సాధించాల‌ని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. 2011లో ధోనీ కెప్టెన్సీలో క‌ప్పును ముద్దాడిన టీమ్​ఇండియా.. మళ్లీ ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలని పట్టుదలతో ఉంది.

ఇదీ చూడండి :

IPL 2023 GT VS MI : దంచికొట్టిన గుజరాత్​.. సర్జరీ తర్వాత తొలిసారి స్టేడియంలో బుమ్రా

మొయిన్‌ అలీకి బిగ్‌ షాకిచ్చిన ఐసీసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.