ETV Bharat / sports

క్రికెట్​ ప్రియులకు గుడ్​న్యూస్​.. ఐపీఎల్-2024 మినీ వేలం అప్పుడే!

author img

By

Published : Jul 31, 2023, 5:35 PM IST

ipl 2024 auction
ipl 2024 auction

IPL 2024 Mini Auction : ఐపీఎల్ అంటే ఆ మజానే వేరు. ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్​.. 16 సీజన్లు పూర్తి చేసుకుంది. అభిమానులకు మంచి కిక్కిచ్చింది. 17వ సీజన్​కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఐపీఎల్ 2024 మినీ వేలం గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఐపీఎల్ మినీ వేలం ఎప్పుడో? వేదిక ఎక్కడో తెలుసా?

IPL 2024 Mini Auction : భారత్​లోనే కాకుండా విదేశాల్లో కూడా ఐపీఎల్​కు ఉండే క్రేజే వేరు. ఐపీఎల్​లా ప్రపంచంలో మరే లీగ్ ఫేమస్ కాలేదు. విదేశీ, స్వదేశీ ప్లేయర్లతో ఐపీఎల్ క్రికెట్ ప్రియులకు మంచి కిక్కిస్తుంది. ఈ లీగ్ జరుగుతున్నంత కాలం క్రికెట్ ప్రియులు టీవీలను వదలరు. కొందరూ టికెట్లు బుక్ చేసుకుని నేరుగా స్టేడియంలో మ్యాచ్​లు చూస్తారు. తమ అభిమాన జట్టు కప్ గెలవాలని కోరుకుంటారు. అయితే 2024 ఐపీఎల్ సీజన్​కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం హాట్​టాపిక్​గా మారింది. ఐపీఎల్ మినీ వేలం-2024, వేదికలు ఇలా కొన్ని విషయాల గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.

India West Indies Tour : టీమ్ఇండియా ప్రస్తుతం వెస్టిండీస్​ సిరీస్​తో బిజీగా ఉంది. ఆ తర్వాత ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఆ సిరీస్ అనంతరం ఆసియా కప్​, అక్టోబర్ 5 నుంచి ఐసీసీ వన్డే ప్రపంచ కప్​నకు సన్నద్ధమవుతోంది. ఈ ఏదాది అంతా టీమ్​ఇండియా షెడ్యూల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మినీ వేలం-2024 ముందుగానే ఈ ఏడాది నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే టీమ్​ఇండియా స్టార్ ప్లేయర్స్, అలాగే విదేశీ జట్లు కూడా బిజీగా ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకుందట. గతేడాది డిసెంబరు 23 ఐపీఎల్​ వేలం నిర్వహించిన బీసీసీఐ.. ఈ ఏడాది అంతకంటే ముందుగానే వేలం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్​పై దృష్టి పెట్టామని.. ఆ తర్వాతే ఐపీఎల్ మినీ వేలం తేదీని నిర్ణయిస్తామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. దాదాపుగా డిసెంబరు మూడు లేదా నాలుగో వారంలో ఐపీఎల్-2024 మినీ వేలం జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ సారి వేలంలో క్రిస్​మస్​ ఈవ్​లో ఉండదని.. అందరికీ అనుకూలమైన తేదీని నిర్ణయిస్తామని అన్నారు. అలాగే ఐపీఎల్ వేలం ఈ సారి అహ్మదాబాద్​, ముంబయి, జైపుర్​, కోల్​కతా నిర్వహించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

IPL 2024 Mini Auction Venue : ఐపీఎల్​ 2023 వేలం కేరళలోని కొచ్చిలో జరిగింది. ఈ వేలంలో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ సామ్ కరన్​ను పంజాబ్ జట్టు రూ.18.5 కోట్లతో దక్కించుకుంది. ఆస్ట్రేలియా బ్యాటర్ కామెరాన్ గ్రీన్​ను.. ముంబయి ఇండియన్స్​ జట్టు రూ.17.5 కోట్లకు సొంతం చేసుకుంది. అలాగే ఆల్​రౌండర్ బెన్​ స్టోక్స్​ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.16.25 కోట్లకు సొంత చేసుకుంది. 2023 ఐపీఎల్ సీజన్​లో చెన్నై సూపర్ సింగ్స్ విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ రన్నరప్​గా నిలిచింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.