ETV Bharat / sports

బీసీసీఐ అపెక్స్​ కౌన్సిల్​ మీటింగ్​ ఫిక్స్​.. టీ20 ఫార్మాట్​కు కొత్త కెప్టెన్​?

author img

By

Published : Dec 19, 2022, 6:53 PM IST

BCCI Apex Council meeting
BCCI Apex Council meeting

బీసీసీఐ అపెక్స్​ కౌన్సిల్​ సమావేశం బుధవారం జరగనుంది. ఈ సమావేశంలో టీ20 ఫార్మాట్​కు కొత్త కోచ్​తో పాటు కొత్త కెప్టెన్​ను నియమించడంపై నిర్ణయం తీసుకోనుంది. వీటితో పాటు జట్టు సమస్యలపై చర్చించనుంది.

భారత క్రికెట్​ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) అపెక్స్​ కౌన్సిల్​ సమావేశం వర్చువల్​ పద్ధతిలో డిసెంబర్​ 21న జరగనుంది. సెంట్రల్​ కాంట్రాక్ట్స్​, కొత్త సెలెక్షన్​ కమిటీ నియామకం లాంటి విషయాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. వాటితో పాటు వివిధ ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు, కోచ్​లను నియమించాలనే విషయంపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్​లో భారత్​ ప్రదర్శన ఆందోళన కలిగించే విధంగా ఉంది. దీంతో టీ20 ఫార్మాట్​ కొత్త కెప్టెన్​ నియమించాలని బోర్డు నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది. అదే జరిగితే ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్యకు ఆ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. కోచ్​లపై భారం పడకుండా.. రాహుల్​ ద్రవిడ్​ను టెస్టు, వన్డే కోచ్​గా ఉంచి.. టీ20 బాధ్యతలను కొత్త కోచ్​కు అప్పగిస్తారని సమాచారం. కాగా, టీమ్​ సపోర్టింగ్​ స్టాఫ్​ పనితీరుపై బీసీసీఐ కోపంతో ఉన్నట్టు తెలుస్తోంది. వారిపై కూడా వేటు వేసి కొత్త వారిని తీసుకునే అవకాశం ఉంది.

కొత్త సెలెక్షన్​ కమిటీని ఆమోదించి.. టీమ్ఇండియా జెర్సీ స్పాన్సర్లు బైజూస్​, ఎంపీఎల్​ల స్పాన్సర్​షిప్​ పురోగతిపై కూడా చర్చించే అవకాశాలున్నాయి. ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ సబ్​ కమిటీని ఏర్పాటు చేయడం; శ్రీలంక, న్యూజిలాండ్​, ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు మ్యాచ్​ల వేదికలను ఖరారు చేయడం; జట్టు గాయాల మేనేజ్​మెంట్ లాంటి అంశాలు చర్చించే అజెండాలో ఉన్నట్టు తెలుస్తోంది. బార్డర్​-గవాస్కర్​ ట్రోఫీలో భాగంగా భారత్​-ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్​లో జరగబోయే పింక్​ బాల్​ టెస్టుపై కూడా బీసీసీఐ ఓ నిర్ణయానికి రానుందని సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.