ETV Bharat / technology

ఫ్రీ కూపన్ కోడ్స్​ & గ్రాఫిక్ డిజైన్ టూల్స్ కావాలా? ఈ టాప్-10 వెబ్​సైట్స్​పై ఓ లుక్కేయండి! - Incredibly Useful Websites

author img

By ETV Bharat Telugu Team

Published : May 18, 2024, 3:04 PM IST

10 Incredibly Useful Websites : ఇంటర్నెట్ వచ్చాక ప్రపంచమంతా మన గుప్పెట్లోకి వచ్చేసింది. కానీ మనకు కావాల్సిన సమాచారం ఇచ్చే వెబ్​సైట్లు వెతుక్కోవాల్సిన బాధ్యత మనదే. అందుకే ఈ ఆర్టికల్​లో అందరికీ ఉపయోగపడే టాప్​-10 సైట్స్​ గురించి వివరించాం.

Best websites for free coupon code
10 Incredibly Useful Websites (ETV Bharat)

10 Incredibly Useful Websites : ప్రస్తుత కాలంలో సమాచారమే ఒక సంపద (ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్)గా మారిపోయింది. అందుకే మనకు కావాల్సిన సరైన సమాచారం కోసం ఇంటర్నెట్ అంతా వెతికేస్తూ ఉంటాం. కానీ కొన్ని సార్లు ఎంత సెర్చ్​ చేసినా మనకు కావాల్సిన సరైన ఇన్ఫర్మేషన్​ లభించకపోవచ్చు. అందుకే ఈ ఆర్టికల్​లో సరైన సమాచారం ఇచ్చే టాప్​-10 వెబ్​సైట్స్ గురించి తెలుసుకుందాం.

1. Honey
హనీ అనేది పేపాల్​కు చెందిన ఒక వెబ్​సైట్​. దీనిలో అన్ని రకాల కూపన్​ కోడ్​లు, డిస్కౌంట్​లు ఉంటాయి. కనుక షాపింగ్ ప్రియులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ హనీ సైట్​లోని కూపన్ కోడ్​లు ఉపయోగించి, మీరు కోరుకున్న దాన్ని మంచి డిస్కౌంట్​తో కొనుగోలు చేయవచ్చు.

2. Have I Been Pwned?
నేడు గుర్తింపు దొంగతనం (ఐడెంటిటీ థెఫ్ట్​), డిజిటల్ డేటా లీక్​లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకవేళ మీ వ్యక్తిగత సమాచారం లేదా డేటా లీక్ అయ్యిందో, లేదో తెలుసుకోవాలంటే ఈ Have I Been Pwned వెబ్​సైట్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

3. WeTransfer
మన బంధువులకు లేదా స్నేహితులకు ఫ్యామిలీ ఫొటోలు, వీడియోలు ఆన్​లైన్​లో పంపించాల్సి వస్తుంది. కానీ అవి చాలా పెద్ద సైజులో ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వీట్రాన్స్​ఫర్​ బాగా పనికి వస్తుంది. ఈ వైబ్​సైట్​ మీ ఫైల్స్​ అన్నింటినీ పంపించడానికి అవసరమైన డౌన్​లోడ్ లింక్​ను క్రియేట్ చేస్తుంది. దానిని సింపుల్​గా మీ బంధువులు, స్నేహితులకు పంపిస్తే సరిపోతుంది.

4. Adobe Acrobat PDF Filler
పీడీఎఫ్​ ఫైల్​ను ఎడిట్ చేయాలంటే, ప్రోవెర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మీరు ఆన్​లైన్​లో ఉచితంగా అడోబ్​ అక్రోబాట్ పీడీఎఫ్​ ఫిల్లర్​ను వాడుకోవచ్చు. ఇందుకోసం మీరు ఫ్రీ అడోబ్ అకౌంట్​ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తరువాత అడోబ్ పీడీఎఫ్​ను మీరు ఫ్రీగా ఎడిట్ చేయవచ్చు. సంతకం పెట్టవచ్చు. ఫ్రీగా డౌన్​లోడ్ చేసుకోవచ్చు.

5. Project Gutenberg
ప్రాజెక్ట్ గుటెన్​బర్గ్​ను 1971లో కొంత మంది వాలంటీర్లు కలిసి స్థాపించారు. దీనిలో డిజిటల్​ ఫార్మాట్​లో పుస్తకాలు, మ్యూజిక్ ఆల్బమ్​లు ఉంటాయి. ఇందులోని ప్రసిద్ధమైన సాహిత్య రచనలను మీరు ఉచితంగా చదవవచ్చు.

6. The Internet Archive
ఇంటర్నెట్ ఆర్కైవ్​లో భారీ స్థాయిలో పుస్తకాలు, చలనచిత్రాలు (మూవీస్​), సంగీతం, వెబ్​పేజీలు, సాఫ్ట్​వేర్​ ప్రోగ్రామ్​లు ఉంటాయి. వీటన్నింటినీ పూర్తి ఉచితంగా యాక్సెస్​ చేయవచ్చు.

7. Grammarly
వర్క్​ డాక్యుమెంట్లు క్రియేట్ చేసేటప్పుడు, ఈ-మెయిల్స్​ రాసేటప్పుడు వాటిలో చాలా అక్షర దోషాలు, వ్యాకరణ లోపాలు ఉంటుంటాయి. వీటిని సరిచేసేందుకు గ్రామర్లీ అనేది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఈ గ్రామర్లీ ఏఐ ఇంటిగ్రేషన్​తో పనిచేస్తుంది. దీనిని మీరు ఫ్రీగా వాడుకోవచ్చు. అదనపు ఫీచర్లు కావాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సి వస్తుంది.

8. FamilySearch
ఇది ఒక డేటాబేస్​. జీసెస్​ క్రైస్ట్​ నుంచి నేటి సెయింట్స్ వరకు అందరి గురించి ఇది తెలియజేస్తుంది. అంటే అత్యంత సమగ్రమైన వంశవృక్షాన్ని ఇది తెలియజేస్తుంది. కనుక దీనిని ఉపయోగించి ఒక వంశం ఆవిర్భవించిన దగ్గర నుంచి వలస వెళ్లడం వరకు, అన్ని రకాల కుటుంబ రికార్డ్​లను పూర్తి ఉచితంగా చూడవచ్చు.

9. Doodle
ఇది ఒక ఫ్రీ వెబ్​ యాప్​. దీని ద్వారా మీటింగ్స్ పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్​తో కలవవచ్చు. ఇతర గ్రూప్ యాక్టివిటీలను షెడ్యూల్ చేసుకోవచ్చు. అంతేకాదు మీరు డూడుల్ పోల్​ను పెట్టవచ్చు. దీని ద్వారా అందరికీ అనువైన సమయంలో మీటింగ్​లు పెట్టుకోవచ్చు.

10. Canva
గ్రాఫిక్​ డిజైనింగ్ నైపుణ్యం లేనివారు కూడా అద్భుతమైన గ్రాఫిక్స్ రూపొందించడానికి, రెజ్యూమ్​లు, అన్ని రకాల డాక్యుమెంట్లు క్రియేట్ చేసుకోవడానికి కాన్వా చాలా బాగా ఉపయోగపడుతుంది. సోషల్ మీడియా ఇన్​ఫ్లూయెన్సర్లకు అయితే ఇది ఒక వరం లాంటిది అని చెప్పవచ్చు. దీనిలో ఫొటోలు, వీడియోలు, ఎలిమెంట్స్​ సహా బోలెడు ఫీచర్లు ఉంటాయి. విషయం ఏమిటంటే, దీనిలో ఫ్రీ వెర్షన్ కూడా ఉంది. అదనపు ఫీచర్ల కోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

కంటి చూపుతోనే స్క్రీన్​ను ఆపరేట్ చేసేలా - యాపిల్ నయా ఫీచర్స్​! - Apple Accessibility Features

క్రెడిట్​, డెబిట్​ కార్డ్​ యూజర్లకు అలర్ట్​ - ఈ కామన్​ 'పిన్స్​'ను వెంటనే మార్చండి - లేకుంటే ఇక అంతే! - Most Common PIN Patterns

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.