ETV Bharat / sports

Ashes 2023 : ఆసీస్​ వీరుడి శతకొట్టుడు..ఇంగ్లాండ్​ కొంపముంచిన నోబాల్!

author img

By

Published : Jun 18, 2023, 11:02 AM IST

England Vs Australia Ashes : యాషెస్​ టెస్ట్ సిరీస్​లో భాగంగా జరిగిన రెండో రోజు మ్యాచ్​ ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఇంగ్లీష్​ జట్టు ఇచ్చిన భారీ లక్ష్యాన్ని చేధించేందుకు దిగిన ఆసీస్ జట్టు..తొలుత నెమ్మదించినప్పటికీ ఆ తర్వాత జోరందుకుని ఇప్పుడు లక్ష్యానికి చేరువలో ఉంది. అయితే ఇంగ్లాండ్​ ప్లేయర్​ చేసిన ఓ తప్పిదం వల్ల ఆసిస్​ జట్టుకు భారీ స్కోర్​ చేకూరింది. ఎలా అంటే ?​

Usman Khawaja no ball video
Usman Khawaja no ball video

Ashes 2023 : క్రికెట్‌ హిస్టరీలో నోబాల్ వేయడం అనేది ఓ పెద్ద తప్పుగా భావిస్తారు. అలాంటి ఘోర తప్పిదమే ఇంగ్లాండ్​ బౌలర్​ బ్రాడ్ చేశాడు. అది కూడా సెంచరీ హీరో వికెట్ టేకింగ్ డెలివరీని నోబాల్‌గా వేసి దానికి తగ్గ మూల్యాన్ని చెల్లించుకున్నాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 81 ఓవర్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట హల్​చల్​ చేస్తోంది. ఈ ఓవర్ రెండో బంతిని బ్రాడ్ అద్భుత ఇన్‌ స్వింగర్‌గా వేయగా.. ఆసీస్​ బ్యాటర్​ ఉస్మాన్​ ఖవాజా క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

బంతిని ఏ మాత్రం అంచనా వేయకపోవడం వల్ల ఖవాజా మిడిల్ స్టంప్‌ను బంతి గీరాటేసింది. ఈ వికెట్‌తో ఇంగ్లాండ్​ ఆటగాళ్లు మ్యాచ్ గెలిచినంత సంబరాలు చేసుకోగా.. ఖవాజా నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. సరిగ్గా అదే సమయంలో అంపైర్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ఆ బంతిని నోబాల్ అంటూ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. ముఖ్యంగా ఆ సమయంలో స్టువర్ట్ బ్రాడ్ బాధ మాటల్లో చెప్పలేనిది.

Ashes 2023 no ball : ఈ విషయంపై అతడు అంపైర్‌తో వాదించినప్పటికీ ఫలితం లేకపోయింది. కానీ రిప్లేలో లైన్ ధాటినట్లు స్పష్టంగా కనిపిచింది. ఈ అవకాశంతో ఖవాజా కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. అప్పటికీ ఆసీస్ స్కోర్ 264/5 కాగా.. ఉస్మాన్ ఖవాజా 112 రన్స్​ స్కోర్​ చేశాడు. ఒక వేళ ఈ వికెట్​ను డిక్లేర్​ చేసి ఉంటే ఆసీస్ జట్టు 300 స్కోర్​ చేసే లోపే ఆలౌటయ్యేది. ఇంగ్లాండ్‌కు భారీ ఆధిక్యం లభించడంతో పాటు గెలుపుకు మంచి అవకాశాలు లభించేవి. కానీ బ్రాడ్ చేసిన నోబాల్ తప్పిదం వల్ల ఆ జట్టు కొంపమునిగినంత పని అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో సెన్సేషన్​ సృష్టిస్తోంది.

Eng Vs Aus Ashes 2023 : ఇక మ్యాచ్​ విషయానికి వస్తే.. యాషెస్​ టెస్ట్​లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో రెండో రోజు ఆసక్తికరంగా సాగింది. తొలుత కాస్త నెమ్మదించిన ఆసీస్​ ప్లేయర్లు ఆ తర్వాత ఊపందుకున్నారు. ఇక కంగారు జట్టు ప్లేయర్​ ఉస్మాన్‌ ఖవాజా సెంచరీతో బాది జట్టు స్కోర్​ పెరిగేలా చేయగా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 311/5తో మెరుగైన స్థితిలో నిలిచింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా టీమ్​ వద్ద 5 వికెట్లు ఉంది. ఇంగ్లాండ్​ నిర్దేశించిన లక్ష్యం చేరుకోవాలంటే వారికి ఇంకా 82 పరుగులు కావాల్సి ఉంది. అయితే ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ చేసిన ఘోర తప్పిదం వల్ల ఇప్పుడు గెలుపు ఏవరికి దక్కుతుందో అన్న ఆసక్తి క్రికెట్​ లవర్స్​లో నెలకొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.