ETV Bharat / sports

Ashes series Eng vs Aus 5th test 2023 : వార్నర్​ హైలైట్ రికార్డ్​.. ఐదో టెస్టులో కీలక మలుపు

author img

By

Published : Jul 31, 2023, 6:58 AM IST

Ashes series england vs australia fifth test live updates : యాషెస్‌ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న ఆఖరిదైన ఐదో టెస్టు మరో కీలక మలుపు తీసుకుంది. ఆస్ట్రేలియా ఓపెనర్​ వార్నర్​ ఓ అరుదైన మార్క్​ను అందుకున్నాడు. ఆ వివరాలు..

Ashes series
Eng vs Aus fifth test : వార్నర్​ హైలైట్ రికార్డ్​.. ఐదో టెస్టులో కీలక మలుపు

england vs australia fifth test live updates : యాషెస్‌ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న ఆఖరిదైన ఐదో టెస్టు మరో కీలక మలుపు తీసుకుంది. విజయం ఇంగ్లాండ్​ను కాకుండా ఆస్ట్రేలియా ఖాతాలో పడేలో కనిపిస్తోంది. 384 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలో దిగిన ఆసీస్​.. ఆదివారం వర్షం కారణంగా నాలుగో రోజు ఆట పూర్తయ్యే సమయానికి ఒక్క వికెట్​ కూడా కోల్పోకుండా 135 పరుగులను తన ఖాతాలో వేసుకుంది.

ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (99 బంతుల్లో 58 బ్యాటింగ్‌; 9×4), ఉస్మాన్‌ ఖవాజా (130 బంతుల్లో 69 బ్యాటింగ్‌; 8×4) పట్టుదలతో క్రీజులో కొనసాగుతూ ఆడుతున్నారు. ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే.. చివరి రోజు ఇంకా 249 పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. ఇంగ్లాండ్ గెలవాలంటే 10 వికెట్లు తీయాలి.

ఆదివారం ఓవర్‌నైట్‌ స్కోరు 389/9తో రెండో ఇన్నింగ్స్​ను ప్రారంభించింది ఇంగ్లాండ్‌ జట్టు. మరో ఆరు పరుగులు చేసి 395 పరుగులకు ఆలౌట్​గా నిలిచింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనను ప్రారంభించింది. అయితే వర్షం కారణంగా ఆ జట్టు 38 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్‌ చేయగలిగింది. ఆస్ట్రేలియా జట్టు వికెట్లను త్వరత్వరగా పడగొట్టి.. విజయాన్ని అందుకోవాలనుకున్న ఇంగ్లాండ్‌ జట్టుకు.. వార్నర్‌, ఖవాజా గట్టిగా ఎదుర్కొన్నారు. ఎక్కడా తడబడకుండా ఆచితూచి ఆడుతూ... ప్రత్యర్థి బౌలర్లకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఆడారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరూ హాఫ్​ సెంచరీలు పూర్తి చేశరు. ఇకపోతే సోమవారం ఐదో రోజు కూడా మ్యాచ్​కు వర్షం అంతరాయం కలిగించే సూచనలు ఉన్నాయి. కాబట్టి మ్యాచ్‌కు ఎలాంటి ముగింపు లభిస్తుందో, విజయం ఎవరిని వరిస్తుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

2017-18 సిరీస్‌ తర్వాత తొలిసారి.. యాషెస్‌ సిరీస్​ 2017-18 సిరీస్‌ తర్వాత మొదటిసారి సెంచరీ భాగస్వామ్యం నమోదైంది. ఆ సీజన్‌లో వార్నర్‌-కెమరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌ మొదటి వికెట్‌కు 122 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మళ్లీ ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్‌లో వార్నర్‌-ఖ్వాజా పెయిర్​ అజేయమైన 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.

Warner ashes series 2023 : ఇప్పటివరకు 25 సార్లు.. ఆస్ట్రేలియా సీనియర్​ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఓ మార్క్​ను అందుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక సార్లు (25) 100 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యాలు నెలకొల్పిన ఆటగాడిగా నిలిచాడు. అలాగే యాషెస్​లో వార్నర్​ ఇప్పటివరకు 8 సెంచరీ పార్ట్‌నర్‌షిప్స్‌లో భాగమయ్యాడు. ఉస్మాన్‌ ఖ్వాజాతో కలిసి అజేయ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేయడం వల్ల వార్నర్‌ ఈ ఫీట్​ను అందుకున్నాడు.

ఇదీ చూడండి :

Stuart Broad Records : ఒకే ఓవర్లో 36 పరుగుల సమర్పించి.. టెస్టుల్లో టాప్ బౌలర్​గా ఎదిగి..

Stuart Broad On Yuvraj Singh : యువరాజ్​ వల్లే సక్సెస్​ అయ్యా.. ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేను : బ్రాడ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.