ETV Bharat / sports

Stuart Broad On Yuvraj Singh : యువరాజ్​ వల్లే సక్సెస్​ అయ్యా.. ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేను : బ్రాడ్

author img

By

Published : Jul 30, 2023, 9:01 PM IST

Updated : Jul 30, 2023, 10:58 PM IST

Stuart Broad On Yuvraj Singh
యూవీ ఇన్నింగ్స్ పై బ్రాడ్

Stuart Broad On Yuvraj Singh : రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ బౌలర్.. మీడియాతో మాట్లాడాడు.​ తన బౌలింగ్​లో యువరాజ్ ఆరు సిక్సులు బాదిన సంఘటన గురించి ఓ విలేకరి అడిగాడు. ఆ ప్రశ్నకు స్పందించిన బ్రాడ్ ఏమన్నాడంటే!

Stuart Broad On Yuvraj Singh : ఇంగ్లాండ్ స్టార్ బౌలర్​ స్టువర్ట్ బ్రాడ్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. టీమ్ఇండియా మాజీ బ్యాటర్ యువరాజ్​ సింగ్​ను గుర్తుచేసుకున్నాడు. 2007 టీ 20 ప్రపంచకప్​లో యువీ.. తన బౌలింగ్​లో ఆరు బంతులకు ఆరు సిక్స్​లు బాదిన సంఘటనను బ్రాడ్ ఇప్పటికీ మర్చిపోలేదన్నాడు. అయితే ప్రస్తుతం యాషెస్​ చివరి టెస్టు ఆడుతున్న బ్రాడ్.. మూడో రోజు ఆట తర్వాత మీడియాతో మాట్లాడాడు. ఓ విలేకరి.. యువీ గురించి అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చాడు.

"యువీ నా బౌలింగ్​లో ఆరు సిక్సులు బాదిన ఆ రోజు నా కెరీర్​లోనే కఠినమైనది. నేను 2007 ప్రపంచకప్​ ఆడుతున్నప్పుడు నా వయసు బహుశా 21,22 సంవత్సరాలు. అప్పటికి నాకు ఇంటర్నేషనల్​ క్రికెట్ ఆడిన అనుభవం ఏమీ లేదు. మ్యాచ్​కు ముందు పెద్దగా ప్రాక్టీస్ కూడా చేసేవాణ్ని కాదు. యువీకి ఆరు సిక్సులు సమర్పించుకున్నాక.. కెరీర్​పై దృష్టి పెట్టాను. ఆ మ్యాచ్​ నాకు మానసికంగా బలపడడానికి సహాయపడింది. టోర్నీలో మాకు ఆ మ్యాచ్ నామమాత్రమైనది. లేకపోతే మా జట్టు నా వల్లే ఎలిమినేట్ అయ్యిందని బాధపడేవాడిని. కానీ ఆ చేదు అనుభవమే నన్ను ఈ రోజు ఇక్కడి వరకూ తీసుకొచ్చింది. 15 - 16 ఏళ్ల కెరీర్​లో నాకు తెలిసొచ్చిందేమిటంటే.. క్రికెట్​లో మంచి రోజుల కంటే చెడ్డ రోజులే ఎక్కువగా ఉంటాయి. పరిస్థితులకు తగ్గట్లు అన్నింటినీ ఎదుర్కోవాలి"

- స్టువర్ట్ బ్రాడ్, ఇంగ్లాండ్ క్రికెటర్..

Stuart Broad Ben Stokes : అలాగే బ్రాడ్.. తన సహచర ఆటగాడు బెన్ స్టోక్స్ గురించి కూడా ప్రస్తావించాడు. 2016 టీ20 ప్రపంచకప్​ ఫైనల్​లో విండీస్ బ్యాటర్ బ్రాత్​వైట్​కు, స్టోక్స్ నాలుగు సిక్సులు ఇచ్చిన సంఘటనను గుర్తుచేశాడు. ఆ ఫైనల్స్​​లో ఇంగ్లాండ్ ఓడింది. కానీ ఆ తర్వాత స్టోక్స్.. తనను తాను మెరుగుపర్చుకున్నాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ విజయాల్లో, వారు 2019 వరల్డ్ కప్​ గెలవడంలో స్టోక్స్ ఎంత కీలకం అయ్యాడో చెప్పుకొచ్చాడు.

బ్రాడ్​కు ఘనంగా వీడ్కోలు..
తన కెరీర్​లో చివరి టెస్టు ఆడుతున్న బ్రాడ్​కు ఇరు జట్ల నుంచి గౌరవం దక్కింది. ఇంగ్లాండ్​ ఇన్నింగ్స్​లో 375 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్​గా క్రీజులోకి వచ్చిన బ్రాడ్​కు ఓవల్ స్టేడియంలోని ప్రేక్షకులు, ఇరు జట్ల ఆటగాళ్లు చప్పట్లతో ఘన స్వాగతం పలికారు. అతడు జేమ్స్ అండర్సన్​తో కలిసి బ్యాటింగ్ చేశాడు. ఈ ఇన్నింగ్స్​లో బ్రాడ్ 8 బంతులు ఎదుర్కొని 8 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు. స్టార్క్ బౌలింగ్​లో డీప్ మిడ్ వికెట్​ మీదుగా బ్రాడ్ సిక్సర్​ బాదడంతో స్టేడియం మొత్తం మార్మోగిపోయింది. ఈ సిక్సర్​తో బ్రాడ్.. తన బ్యాటింగ్​ కెరీర్​ను ముగించాడు. ఇత రెండో ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్ 395 పరుగులకు ఆలౌటైంది.

కాగా 384 పరుగుల లక్ష్యంతో బరిగిలోకి దిగిన ఆసిస్ అదరగొడుతోంది. నాలుగో రోజు టీ బ్రేక్​ వరకు ఆస్ట్రేలియా 135/0 తో నిలిచింది. ఓపెనర్లు వార్నర్ (58), ఖవాజా (59) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. కాగా 38 ఓవర్ల వద్ద వర్షం కారణంగా ఆటకు మరోసారి అంతరాయం కలిగింది. ఆసిస్ విజయానికి మరో 249 పరుగులు కావాలి.

  • 🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿 Matches: 1️⃣6️⃣7️⃣
    ☝️ Wickets: 6️⃣0️⃣2️⃣
    🏏 Runs: 3️⃣6️⃣5️⃣4️⃣

    🏆 4x Ashes wins
    🌍 1x T20 World Cup

    🎖️ MBE for services to cricket

    Thank you, Broady ❤️

    — England Cricket (@englandcricket) July 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
Last Updated :Jul 30, 2023, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.