ETV Bharat / sports

Ashes 2021: డే/నైట్ టెస్టులో స్టార్క్ సరికొత్త రికార్డు

author img

By

Published : Dec 18, 2021, 6:47 PM IST

Ashes 2021: యాషెస్​ సిరీస్​లోని ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ రెండో టెస్టులో భాగంగా ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ అరుదైన ఘనత సాధించాడు. డే/నైట్ టెస్టుల్లో 50 వికెట్లు తీసిన తొలి బౌలర్​గా నిలిచాడు.

starc
స్టార్క్

Ashes 2021: ఆస్ట్రేలియా ఎడమ చేతివాటం పేసర్ మిచెల్ స్టార్క్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. డే/నైట్ టెస్టుల్లో 50 వికెట్లు తీసిన తొలి బౌలర్​గా నిలిచాడు. యాషెస్​ సిరీస్​లో భాగంగా ఇంగ్లాండ్​తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో ఈ ఘనత సాధించాడు.

అడిలైడ్​ వేదికగా జరిగిన రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్​ చేసిన ఆస్ట్రేలియా 473 పరుగులు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్​ ఆడిన ఇంగ్లాండ్ 236 పరుగులకే కుప్పకూలింది. పేసర్​ మిచెల్​ స్టార్క్ నాలుగు కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్​ను కట్టడి చేయండంలో ముఖ్య పాత్ర పోషించాడు.

ఓపెనర్​ రోరీ బర్న్స్​ను ఆదిలోనే పెవిలియన్​ చేర్చిన స్టార్క్.. డేవిడ్​ మలన్(80)ను కూడా ఔట్ చేశాడు. వికెట్ కీపర్ బ్యాట్స్​మన్ జాస్ బట్లర్, స్టువర్ట్ బ్రాడ్ కూడా స్టార్క్ చేతికే చిక్కారు. దీంతో 16 ఓవర్లు బౌలింగ్ చేసిన స్టార్క్​ 37 పరుగులు ఇచ్చి నాలుగు కీలక వికెట్లు తీశాడు. పింక్​ బాల్ డే/నైట్ టెస్టు మ్యాచ్​లో 50 వికెట్లు తీసిన తొలి అంతర్జాతీయ క్రికెటర్​గా నిలిచాడు.

డే/నైట్ టెస్టుల్లో ఆస్ట్రేలియా ఇప్పటివరకు 8 మ్యాచ్​లు ఆడగా అన్నింటిలోనూ విజయం సాధించింది. ఈ మ్యాచ్​ కూడా విజయం తమ ఖాతాలో వేసుకునేందుకే ప్రయత్నిస్తోంది.

ఇదీ చదవండి:

ఇంగ్లాండ్​కు ఐసీసీ షాక్​- 5 కాదు 8 పాయింట్లు కోత

ఎదురులేని రూట్.. సచిన్, గావస్కర్​లను దాటేసి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.