ETV Bharat / sports

ఎదురులేని రూట్.. సచిన్, గావస్కర్​లను దాటేసి!

author img

By

Published : Dec 18, 2021, 12:20 PM IST

Roe Root Test Record: ఇంగ్లాండ్ టెస్టు సారథి జో రూట్ అద్భుత రికార్డు కైవసం చేసుకున్నాడు. టెస్టు క్రికెట్​లో ఓ ఏడాదిలో ఎక్కువ పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే టీమ్ఇండియా దిగ్గజ క్రికెటర్లు సచిన్, గావస్కర్​లను దాటేశాడు.

Joe Root latest news, Joe Root surpasses Sachin Tendulkar Sunil Gavaskar, రూట్ లేటెస్ట్ న్యూస్, సచిన్ గావస్కర్​లను దాటేసిన రూట్
Joe Root

Roe Root Test Record: ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్​ సిరీస్​ రెండో టెస్టులో భాగంగా ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు రూట్. ఈ క్రమంలోనే ఓ క్యాలెండర్ ఇయర్​లో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టీమ్ఇండియా దిగ్గజ ఆటగాళ్లు సచిన్ తెందూల్కర్, సునీల్ గావస్కర్​లను దాటేశాడు.

ప్రస్తుతం ఈ ఏడాది టెస్టు క్రికెట్​లో 1563* పరుగులతో కొనసాగుతున్నాడు రూట్. ఈ క్రమంలోనే సచిన్ (1562), గావస్కర్ (1555)లను దాటేశాడు. ప్రస్తుతం ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడీ ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్. మరో 32 పరుగులు చేస్తే ఆసీస్ మాజీ సారథి మైఖేల్ క్లర్క్ (1595)ను కూడా దాటేసి నాలుగో స్థానానికి చేరుకుంటాడు.

2006లో 11 టెస్టుల్లో 99.33 సగటుతో 1788 పరుగులు చేసిన పాకిస్థాన్​ ఆటగాడు మహ్మద్ యూసుఫ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 1976లో 11 టెస్టుల్లో 1710 పరుగులు చేసిన వెస్టిండీస్ బ్యాటర్ వివ్ రిచర్డ్స్​ రెండో స్థానంలో ఉండగా.. 2008లో 15 మ్యాచ్​ల్లో 1656 పరుగులు చేసిన సౌతాఫ్రికా ఆటగాడు గ్రీమ్ స్మిత్ మూడో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది రూట్ ఆరు సెంచరీలు సాధించాడు. ఇందులో రెండు ద్విశతకాలు, రెండు అర్ధశతకాలు కూడా ఉన్నాయి.

పోరాడుతున్న ఇంగ్లాండ్

AUS vs ENG 2nd Test: ఇక ఈ రెండో టెస్టులో మూడో రోజు డిన్నర్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది ఇంగ్లాండ్. హమీద్ (6), బర్స్న్ (4) త్వరగానే పెవిలియన్ చేరినా.. కెప్టెన్​ రూట్ (57*), మలన్ (68*) సమయోచితంగా ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్​లో ఇంకా 333 పరుగులు వెనకపడి ఉంది ఇంగ్లీష్ జట్టు.

ఇవీ చూడండి: 'కోహ్లీ అలాంటి రకం కాదు.. ఒక్కసారి బరిలో దిగితే అంతే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.