ETV Bharat / sports

మురళీధరన్‌ @800 - టెస్ట్ క్రికెట్ చరిత్రలో 500 వికెట్లు తీసిన వీరులు వీళ్లే!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 31, 2023, 11:12 AM IST

500 Wickets in test cricket : క్రికెట్​లో 100 వికెట్లు తీయడమంటేనే ఇక ఆ వ్యక్తి చరిత్ర తిరగరాసేందుకు ముందుకొచ్చినట్లే. అటువంటిది 500 వికెట్లు తీయడమంటే అది ఓ పెద్ద రికార్డు అనే లెక్క. ఇలా టెస్ట్​ క్రికెట్​లో ఇప్పటి వరకు 500 కన్నా ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ల గురించి తెలుసుకుందాం.

500 Wickets in test cricket
500 Wickets in test cricket

500 Wickets In Test Cricket : క్రికెట్​లోని ఏ ఫార్మట్​లోనైనా సరే వంద వికెట్లు తీయడం అంటే అది ఓ రికార్డు కింద లెక్కే. దీన్ని ఆ బౌలర్ అంతర్జాతీయ కెరీర్​లో ఓ ప్రత్యేక మైల్​స్టోన్​గా చెప్పొచ్చు. ఓవర్ల సంఖ్యను బట్టి చూస్తే టెస్టుల్లో ఈ ఫీట్ సాధించే అవకాశాలు చాలా ఉన్నాయి. తాజాగా అస్ట్రేలియా బౌలర్ నాథన్ లియాన్​ ఇప్పటి వరకు తన కెరీర్​లో మొత్తం 500 వికెట్లు తీసిన రికార్డుకెక్కాడు. దీంతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాపై అందరి దృష్టి పడింది. ఇప్పటికే 800 వికెట్లు తీసి ఈ లిస్టులో శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఈయనలాగే మరికొంత మంది ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లు ఉన్నారు. ఇంతకీ వారెవరంటే ?

1. ముత్తయ్య మురళీధరన్ (800)
అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో ఎక్కువ వికెట్లు తీసిన లిస్ట్​లో శ్రీలంక మాజీ ప్లేయర్ ముత్తయ్య మురళీధరన్ టాప్​లో ఉన్నారు. ఈయన తన కెరీర్​లో మొత్తం 800 వికెట్లు తీశాడు. రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ అయిన శ్రీలంక స్పిన్ మాంత్రికుడు తన కెరీర్​లో ఐదేసి వికెట్లు చొప్పున 67 సార్లు, పది వికెట్లు చొప్పున 22 సార్లు వికెట్లు పడగొట్టి తన టీమ్​ను విజయతీరాలకు చేర్చాడు.

2. షేర్ వార్న్(708)
ప్రపంచ గొప్ప స్పిన్నర్లలో ఒకరైన దిగ్గజ క్రికెటర్​ షేర్ వార్న్. అత్యధిక వికెట్ల క్లబ్​లో రెండో స్థానంలో ఉన్నారు. ఈయన తన కెరీర్​లో 708 వికెట్లు పడగొట్టి రికార్డుకెక్కాడు. 108 టెస్టుల్లో 500 వికెట్లు పడగొట్టిన వార్న్. 145 మ్యాచుల్లో 708 వికెట్లు తీశాడు. షేర్ వార్న్ బంతులను ఎదుర్కొవడమంటే బ్యాటర్లకు పీడ కలగా భావిస్తుండేవారు.

3. జేమ్స్ అండర్సన్ (690)
2003లో టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేసిన జేమ్స్ అండర్సన్ రెడ్ బాల్​ ఫార్మాట్​లో మొత్తం 690 వికెట్లు పడగొట్టాడు. ఇతని స్పీడ్​ను చూసిన అభిమానులు త్వరలో ఈ స్టార్​ ప్లేయర్​ 700 వికెట్ల మైలురాయిని చేరుకోవచ్చు. ప్రస్తుతానికి 183 మ్యాచులతో 690 వికెట్లతో టాప్ త్రీ బౌలర్గా కొనసాగుతున్నాడు అండర్సన్. 41 ఏళ్ల ఈ స్టార్​ క్రికెటర్​ ఐదు వికెట్లు చొప్పున 32 సార్లు పది వికెట్ల చొప్పున మూడు సార్లు వికెట్లు పడగొట్టాడు.

4. అనిల్ కుంబ్లే (619)
ఆడిన 189 ఇన్నింగ్స్​లో 619 వికెట్లు పడగొట్టిన అద్భుతమైన బౌలర్ అనిల్ కుంబ్లే. భారత్ తరపున ఈ లిస్టులో ఉన్న ఏకైక ఆటగాడు కూడా కుంబ్లేనే కావడం విశేషం. తన కెరీర్లో ఆయన 132 టెస్టులు ఆడాడు. ఇందులో 619 వికెట్లు తీయగా, 35 ఇన్నింగ్స్‎లో 5 వికెట్లు చొప్పున, ఏడు మ్యాచులలో పది వికెట్లు తీశాడు. ఇక ఇన్నింగ్స్​లో పది వికెట్లు తీసిన రెండో బౌలర్​ కూడా కుంబ్లే కావడం విశేషం.

5. స్టువర్ట్ బ్రాడ్ (604)
2020లో స్వదేశంలో వెస్టిండిస్​తో జరిగిన మ్యాచ్​లో 600 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు ఇంగ్లాండ్​ ప్లేయర్​ స్టువర్ట్ బ్రాడ్. ఇప్పటివరకు 167 మ్యాచ్లు ఆడిన బ్రాడ్ మొత్తం 604 వికెట్లు పడగొట్టాడు. అత్యంత వేగంగా 600 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా బ్రాడ్ రికార్డు సృష్టించాడు. స్టువర్ట్ బ్రాడ్ అద్భుతమైన క్రికెట్ కెరీర్​లో 20 సార్లు ఐదేసి వికెట్లు చొప్పున, మూడు సార్లు పది వికెట్లు తీశాడు.

6. గ్లెన్ మెక్ గ్రాత్ (563)
అత్యంత విజయవంతమైన అసీస్ బౌలర్లలో గ్లెన్ మెక్ గ్రాత్ ఒకడు. ఫాస్ట్ బౌలర్​గా కెరీర్​లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన మెక్ గ్రాత్ యాషెస్ సిరీస్​లో 500 వికెట్ల మైలురాయిని కూడా అధిగమించాడు. కెరీర్​లో 124 మ్యాచ్​లు ఆడిన మెక్ గ్రాత్ 563 వికెట్లు తీశాడు. ఇందులో 29 మ్యాచ్​లలో 5 వికెట్లు చొప్పున పడగొట్టగా, మూడుసార్లు పది వికెట్లు తీశాడు. ఇక మెక్​గ్రాత్ అత్యుత్తమ గణాంకాలు 8/24.

7. కోర్ట్నీ వాల్స్(519)
అంతర్జాతీయ క్రికెట్​లో 500 వికెట్లు తీసిన తొలి ఆటగాడు కోర్ట్నీవాల్స్. మొత్తం 132 మ్యాచులు ఆడిన కోర్ట్నీ అందులో 519 వికెట్లు తీశాడు. ఇందులో 22 సార్లు ఐదేసి వికెట్లు పడగొట్టగా, మూడు సార్లు 10 వికెట్లు తీశాడు.

8. నాథన్ లియాన్ (501)
ఆస్ట్రేలియాకు చెందిన నాథన్ లియాన్ తాజాగా 500 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. 36 ఏళ్ల నాథన్ లియాన్ మొత్తం 123 టెస్టు మ్యాచ్లు ఆడాడు. 230 ఇన్నింగ్స్​లో 501 వికెట్లు తీసిన నాథన్ లియాన్ ఈ ఏడాది డిసెంబర్ 17న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్​లో ఈ ఫీట్ సాధించాడు. లియాన్ తన కెరీర్​లో 23 సార్లు 5 వికెట్లు తీయగా, నాలుగు సార్లు పది వికెట్లు పడగొట్టాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.