ETV Bharat / sports

కుర్ర అభిమాని బౌలింగ్​లో రోహిత్ బ్యాటింగ్​.. బీసీసీఐ ట్వీట్​

author img

By

Published : Oct 16, 2022, 8:30 PM IST

ఆస్ట్రేలియాలోని వాకా స్టేడియంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఓ కుర్ర అభిమాని బౌలింగ్ టాలెంట్​కు టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫిదా అయ్యాడు. అసలేెం జరిగిందంటే..

Rohit Sharma
రోహిత్ శర్మ

టీ20 ప్రపంచకప్‌ టోర్నీ కోసం టీమ్‌ఇండియా సిద్ధమవుతోంది. పెర్త్‌లోని వాకా స్టేడియంలో భారత జట్టు ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఓ కుర్ర అభిమాని బౌలింగ్‌ టాలెంట్‌కు కెప్టెన్‌ రోహిత్‌ ఫిదా అయ్యాడు. అతడితో బౌలింగ్‌ వేయించుకున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఓ ఫొటో ద్వారా పోస్ట్‌ చేసింది.

"ప్రాక్టీస్‌ సెషన్‌ కోసం ఉదయాన్నే స్టేడియానికి వెళ్లాం. అక్కడ వందల మంది చిన్నారులు ఆట ముగించుకుని తిరిగి వెళ్తున్నారు. అప్పటికే డ్రెస్సింగ్‌ రూం నుంచి మేమంతా వారిని గమనిస్తున్నాం. అందులో ఓ బాలుడి బౌలింగ్‌ చూసి అందరం ఆశ్చర్యపోయాం. అది అతడికి సహజంగానే అబ్బిందేమో అనేంత అవలీలగా ఆడుతున్నాడు. అందరికన్నా ముందే రోహిత్‌ అతడిని గమనించాడు. మైదానంలోకి వెళ్లి తనకు బౌలింగ్‌ వేయాలని అతడిని కోరాడు. వారిద్దరినీ అలా చూడటం చాలా గొప్పగా అనిపించింది. టీమ్ఇండియా కెప్టెన్‌తో ఆడటం ఆ కుర్రాడు ఎప్పటికీ మర్చిపోడు" అని టీమ్‌ విశ్లేషకుడు హరి ప్రసాద్‌ మోహన్‌ వెల్లడించాడు.

భారత కెప్టెన్‌ను కలవడంపై పదకొండేళ్ల దృశిల్‌ చౌహాన్‌ హర్షం వ్యక్తం చేశాడు. "మేం ఇక్కడ ఆడుతున్న సమయంలో రోహిత్‌ శర్మ సర్‌ నన్ను పిలిచి బౌలింగ్‌ వేయమని అడిగాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. 'నువ్వు ఎప్పటికైనా రోహిత్‌కి బౌలింగ్‌ వేస్తావు' అని మా నాన్న ఒకరోజు ముందే నాతో అన్నాడు. ఆ మాటలు నన్నెంతో ఉత్సాహపరిచాయి. నాకు ఇన్‌ స్వింగ్‌ యార్కర్‌ను ఆడటం చాలా ఇష్టం" అని వివరించాడు. ఈ సందర్భంగా రోహిత్‌ సరదాగా మాటలు కలిపాడు. 'పెర్త్‌లో ఉంటూ టీమ్‌ఇండియాకు ఎలా ఆడతావు?' అని దృశిల్‌ను ప్రశ్నించాడు. తాను భారత్‌కు వెళ్తాను.. కానీ ఆడగలనో లేదో తెలియదంటూ ఈ చిన్నారి సమాధానమిచ్చాడు. ఇక టీమ్‌ఇండియా తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌తో ఈ నెల 23న తలపడనుంది.

  • 𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦!

    When a 11-year-old impressed @ImRo45 with his smooth action! 👌 👌

    A fascinating story of Drushil Chauhan who caught the eye of #TeamIndia Captain & got invited to the nets and the Indian dressing room. 👏 👏 #T20WorldCup

    Watch 🔽https://t.co/CbDLMiOaQO

    — BCCI (@BCCI) October 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి: T20 World Cup : పొట్టి కప్పు తీరే వేరు.. ఇప్పటి వరకు ఈ ప్లేయర్లదే జోరు..

T20 World Cup : నమీబియా బోణీ.. శ్రీలంకపై ఘన విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.