ETV Bharat / sitara

RRR: 'ఆర్ఆర్ఆర్'​ కథ వారికోసం రాసిందే

author img

By

Published : Jul 21, 2021, 6:16 PM IST

Was RRR written with Ram Charan, Jr NTR in mind? Vijayendra Prasad answers
"ఆర్ఆర్ఆర్​' నటీనటుల ఎంపికపై మరో ఆలోచనే రాలేదు'

'ఆర్​ఆర్ఆర్​' కథ రామ్​చరణ్​, ఎన్టీఆర్​ను దృష్టిలో పెట్టుకుని రాసిందేనని రచయిత విజయేంద్ర ప్రసాద్​ అన్నారు. అటు కథలో మూలాన్ని మార్చకుండా.. హీరోల స్టార్​డమ్​ దెబ్బతినకుండా సినిమాను రూపొందించామని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

రామ్​చరణ్​, ఎన్టీఆర్​లను దృష్టిలో ఉంచుకొని 'ఆర్​ఆర్​ఆర్​' సినిమా కథను సిద్ధం చేసినట్లు రచయిత, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్​ చెప్పారు. ఇద్దరు స్టార్లతో సినిమా చేస్తున్న కారణంగా ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉండడం సహజమని ఆయన అన్నారు. అయితే అటు చరణ్​, తారక్​ పాత్రలను తక్కువ చేయకుండా.. ఇటు కథను మార్చకుండా సినిమాను తెరకెక్కించామని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ​

"స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్​ పాత్రలతో కథ అనుకున్నప్పుడు దర్శకుడు రాజమౌళి మదిలో మెదిలిన వారు ఇద్దరే. వాళ్లే రామ్​చరణ్​, ఎన్టీఆర్​. ఎందుకంటే రాజమౌళి ఇప్పటికే వాళ్లతో కలిసి పనిచేశాడు. ఈ నేపథ్యంలో మేము అనుకున్న కథకు వీరిద్దరే న్యాయం చేయగలని భావించాం. అనుకున్న విధంగానే చరణ్​, తారక్​ ఆ పాత్రల్లో ఒదిగిపోయారు".

- విజయేంద్ర ప్రసాద్​, 'ఆర్ఆర్ఆర్​' కథారచయిత

"ఆర్ఆర్ఆర్' సినిమాలో నటించిన స్టార్ల ఇమేజ్​ దెబ్బ తినకుండా.. అదే విధంగా కథను నీరుగార్చకుండా తెరకెక్కించాలనేది మా అభిమతం. ఇద్దరు స్టార్​ హీరోలు నటిస్తున్న సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు భారీగానే ఉంటాయి. దీనికి అనుగుణంగా ఎవరి పాత్రను తగ్గించకుండా.. కథా సారాంశం దెబ్బ తినకుండా నిజమైన కథను ప్రేక్షకులకు అందించనున్నాం" రచయిత విజయేంద్ర ప్రసాద్​ వెల్లడించారు.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్​చరణ్​, కొమురం భీమ్​గా ఎన్టీఆర్​ నటించారు. ఆలియా భట్‌, ఒలీవియా మోరీస్‌ కథానాయికలు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటలు మినహా షూటింగ్​ పూర్తి అయ్యింది. ఇటీవలే విడుదలైన 'రోర్​ ఆఫ్​ ఆర్ఆర్ఆర్' మేకింగ్​ వీడియోకు ప్రేక్షకుల నుంచి విశేషాదరణ లభిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి.. ఒక్క పాట కోసం రూ.3 కోట్ల బడ్జెట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.