ETV Bharat / sitara

యూట్యూబ్​ వ్యూస్​లో పోటీపడుతున్న అన్నదమ్ములు

author img

By

Published : May 13, 2020, 2:51 PM IST

Uppena And Ala Vaikuntapuramloo Songs Views compitetion In Youtube
యూట్యూబ్​ వ్యూస్​లో పోటీపడుతున్న అన్నదమ్ములు

అల్లు అర్జున్​, వైష్ణవ్​ తేజ్​ల సినిమాలలోని పాటలు సంగీత అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. యూట్యూబ్​ వ్యూస్​లోనూ రికార్డులను సృష్టిస్తున్నాయి. అందులో ఒకటి 'రాములో రాములా'. మరొకటి 'నీ కన్ను నీలి సముద్రం'. ఈ పాటలు మిలియన్​ వీక్షణలు సాధించి సరికొత్త రికార్డులను తిరగరాస్తున్నాయి.

స్టైలిష్​స్టార్​ అల్లు అర్జున్‌, ఆయనకు సోదరుడి వరసయ్యే వైష్ణవ్‌ తేజ్‌ యూట్యూబ్‌లో సందడి చేస్తున్నారు. ఒకరు వీడియో సాంగ్‌తో ప్రేక్షకులను మెప్పిస్తుంటే మరొకరు ఆడియో సాంగ్‌తో అలరిస్తున్నారు. బన్నీ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'అల.. వైకుంఠపురములో'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి బ్లాక్‌బాస్టర్‌ విజయాన్ని నమోదు చేసుకుంది. తమన్‌ స్వరాలు అందించిన ఈ చిత్రంలోని పాటలు సినిమా విడుదల కంటే ముందే రికార్డులు సృష్టించాయి. తాజాగా ఈ చిత్రంలోని 'రాములో రాములా' వీడియో సాంగ్‌ 100 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుని యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. కాసర్ల శ్యామ్‌ రచించిన ఈ పాటను అనురాగ్‌ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సాయిధరమ్‌ తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ త్వరలోనే వెండితెరకు పరిచయం కానున్నాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఉప్పెన' చిత్రంతో వైష్ణవ్‌ కథానాయకుడిగా అలరించేందుకు సిద్ధమయ్యాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ స్వరాలు అందిస్తున్నాడు. కృతీ శెట్టి కథానాయిక. ఈ సినిమాలోని 'నీ కన్ను నీలి సముద్రం' అనే ఆడియో సాంగ్‌ ఇప్పటివరకు 50 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుని యూట్యూబ్‌లో ప్రేక్షకులను అలరిస్తుంది. విజయ్‌ సేతుపతి ఈ చిత్రంలో కీలకపాత్రలో కనిపించనున్నాడు. వేసవి కానుకగా ఏప్రిల్‌ 2న 'ఉప్పెన' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించినప్పటికీ లాక్‌డౌన్‌ వల్ల కొంతకాలం పాటు వాయిదా వేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి.. 93 ఏళ్ల చరిత్రలో మొదటిసారి ఆస్కార్​ వాయిదా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.