ETV Bharat / sitara

శిల్పాశెట్టి కుటుంబ సభ్యులందరికీ కరోనా

author img

By

Published : May 7, 2021, 3:26 PM IST

నటి శిల్పాశెట్టి కుటుంబసభ్యులు కొవిడ్​ బారినపడ్డారు. ప్రస్తుతం వారంతా, వైద్యుల సూచనలతో కోలుకుంటున్నారని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Shilpa Shetty's husband, children test positive for COVID-19
శిల్పాశెట్టి ఫ్యామిలీ

బాలీవుడ్​ నటి శిల్పాశెట్టి కుటుంబంలో కరోనా కలకలం సృష్టించింది. ఆరుగురు కుటుంబసభ్యులతో పాటు ఇద్దరు సిబ్బందికి వైరస్​ సోకినట్లు ఆమె ఇన్​స్టాలో వెల్లడించారు. శిల్పాశెట్టికి మాత్రం నెగిటివ్​ వచ్చింది.

"గత 10 రోజుల నుంచి మా కుటుంబం కష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొంది. నా అత్తమామలు, అమ్మ, కుమారుడు, కూతురు, భర్త.. కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం వారంతా ఐసోలేషన్​లో ఉండి కోలుకుంటున్నారు" అని శిల్పాశెట్టి రాసుకొచ్చింది.

2009లో పెళ్లి చేసుకున్న రాజ్​కుంద్రా-శిల్పాశెట్టి దంపతులకు 2012లో ఓ అబ్బాయి(వియాన్ రాజ్) పుట్టాడు. గతేడాది ఫిబ్రవరిలో కుమార్తె(సమిషా) జన్మించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.