ETV Bharat / sitara

వుహాన్ గబ్బిలాల మార్కెట్​లో సంపూర్ణేశ్​బాబు సినిమా

author img

By

Published : May 9, 2020, 10:48 AM IST

Sampoornesh Babu new movie first look
హీరో సంపూర్ణేశ్ బాబు

సంపూర్ణేశ్ బాబు హీరోగా నటిస్తున్న మెడికల్ హారర్ సినిమా ఫస్ట్​లుక్ పోస్టర్లు ఆక్టటుకుంటున్నాయి. వీటిలో డిఫరెంట్​గా కనిపిస్తూ అలరిస్తున్నాడు సంపూ.

బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్​బాబు కొత్త చిత్రానికి '?' అనే విచిత్రమైన టైటిల్​ పెట్టారు. మెడికల్ హారర్ కథతో రూపొందిస్తున్న దీని ఫస్ట్​లుక్ పోస్టర్లను, అతడి పుట్టినరోజు సందర్భంగా నేడు విడుదల చేశారు. వుహాన్​ గబ్బిలాల మార్కెట్​లో చిత్రీకరించిన చివరి సినిమా ఇదేనని రాసుకొచ్చారు. రానున్న జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

Sampoornesh Babu new movie first look
సంపూర్ణేశ్​బాబు కొత్త సినిమా పోస్టర్

ప్రస్తుతం ప్రజల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న ప్రాణాంతక కరోనా.. వుహాన్​లోనే పుట్టింది. ఈ వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన సంపూ కొత్త చిత్ర పోస్టర్లు ఆసక్తి రేపుతున్నాయి. 'హృదయ కాలేయం', 'కొబ్బరిమట్ట' నిర్మాతలే ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.