ETV Bharat / sitara

అదిరిపోయే ట్రైలర్​తో అజయ్​ దేవ్​గణ్.. 'బంగార్రాజు' సర్​ప్రైజ్

author img

By

Published : Jan 29, 2022, 5:45 PM IST

Updated : Jan 29, 2022, 6:50 PM IST

Rudra Trailer: సినిమా అప్డేట్లు వచ్చేశాయి. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్​గణ్ తొలిసారి నటిస్తున్న వెబ్​సిరీస్​, 'బంగార్రాజు' చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

Rudra trailer
Ajay Devgn

Rudra Trailer: బాలీవుడ్​ సూపర్​స్టార్​ అజయ్​ దేవ్​గణ్​ వెబ్​సిరీస్​లోకి అరంగేట్రం చేశారు. 'రుద్ర- ది ఎండ్​ ఆఫ్ డార్క్​నెస్'​ అనే సిరీస్​లో నటిస్తున్నారు. శనివారం విడుదలైన ట్రైలర్.. సిరీస్​పై అంచనాలను పెంచేస్తోంది. అజయ్ సరసన రాశీఖన్నా నటిస్తోంది. బ్రిటిష్​ షో 'లూథర్'​ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ థ్రిల్లర్​లో డీసీపీ రుద్రవీర్​ సింగ్​ అనే పవర్​ఫుల్​ పోలీస్ పాత్రలో అలరించనున్నారు అజయ్. ఓటీటీ డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​ వేదికగా ఈ సిరీస్​ ప్రసారంకానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'బంగార్రాజు' స్పెషల్ సాంగ్..

అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు నాగచైతన్య నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'బంగార్రాజు'. సుమారు ఐదేళ్ల క్రితం వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయన'కు సీక్వెల్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ సొంతం చేసుకుంది. సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు ధన్యవాదాలు చెబుతూ.. నాగార్జున సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. 'బంగార్రాజు' నుంచి 'నువ్వు సిగ్గుపడుతుంటే' అనే పాటను ట్విట్టర్​ వేదికగా విడుదల చేశారు. కల్యాణ్‌కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతిశెట్టి కీలకపాత్రలు పోషించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
jayaho ramanuja movie
'జయహో రామానుజ' మూవీ లోగో విడుదల
rrr heroine
'ఆర్​ఆర్​ఆర్​'లో​ ఒలివియా మోరిస్

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: 'ఆర్​ఆర్​ఆర్'​, 'రాధేశ్యామ్​' రిలీజ్​ డేట్స్​.. దిల్​రాజు బిగ్​ న్యూస్​!

Last Updated :Jan 29, 2022, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.