ETV Bharat / sitara

RC 15: షూటింగ్​ వీడియో లీక్​.. కొత్త లుక్​లో రామ్​చరణ్​!

author img

By

Published : Feb 26, 2022, 8:49 AM IST

Updated : Feb 26, 2022, 9:06 AM IST

RC 15 movie video leaked: శంకర్​-రామ్​చరణ్​ కాంబోలో తెరకెక్కుతున్న 'ఆర్​సీ 15' సినిమాకు సంబంధించిన ఓ వీడియో లీక్​ అయింది. ఇందులో చెర్రీ కొత్త లుక్​లో కనిపిస్తున్నారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్​గా మారింది.

rc 15 video leaked
ఆర్​సీ 15 వీడియో లీక్​

RC 15 movie video leaked: చిత్రసీమలో లీక్​ల బెడద తప్పట్లేదు. మేకర్స్​ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా లీక్​ కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఇప్పుడా సెగ మెగాహీరో రామ్​చరణ్​ నటిస్తున్న 'ఆర్​సీ 15'కు తగిలింది. ఈ సినిమా షూటింగ్​లో భాగంగా చరణ్​ మీద తెరకెక్కిస్తున్న సన్నివేశానికి సంబంధించిన ఓ చిన్న వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. ఇందులో చెర్రీ.. ధోతీ ధరించి ఎవరితోనో మాట్లాడుతున్నట్లు, సైకిల్​ తొక్కుతూ కనిపించారు. ఈ క్లిప్​ చూసిన నెటిజన్లు కమల్​హాసన్​ 'భారతీయుడు' సినిమా గుర్తుకొస్తుందని కామెంట్లు చేస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు శంకర్​ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చెర్రీ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దాదాపు రూ.300కోట్లతో ఈ మూవీని రూపొందించనున్నారట! పొలిటికల్​ థ్రిల్లర్​గా తెరకెక్కించనున్న ఈ సినిమాకు తమన్​ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇందులో చెర్రీ.. రెండు విభిన్న గెటప్​లలో కనిపించనున్నారని తెలిసింది. సునీల్, అంజలి, జయరాయ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఇదీ చూడండి: ఆస్కార్: ఈ ఐదుగురిలో ఉత్తమ నటుడు ఎవరవుతారో?

Last Updated : Feb 26, 2022, 9:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.