ETV Bharat / sitara

బాబాయ్ పవర్​స్టార్​ నిర్మాణంలో చెర్రీ

author img

By

Published : Dec 17, 2019, 2:23 PM IST

ramcharan tej news film with his babay pawankalyan production
బాబాయ్​ నిర్మాణంలో చెర్రీ

స్టార్ హీరో పవన్​ కల్యాణ్..​ త్వరలోనే నిర్మాతగా ఓ సినిమా చేయనున్నాడు. ఇందులో తన అన్న చిరంజీవి కొడుకు రామ్​చరణ్​ హీరోగా నటించనున్నాడు. అయితే మంచి కథ కోసం వెతుకుతున్నట్లు చెప్పాడు పవన్.

పవర్​స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా త్వరలో ఓ సినిమా మొదలు కానుంది. 'పింక్' రీమేక్​గా ఈ చిత్రం రూపొందనుంది. దిల్​రాజు నిర్మాత. వేణు శ్రీరామ్ దర్శకుడు. తమన్ సంగీత దర్శకుడు. ఫిబ్రవరిలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్​ ప్రారంభం కానుంది. ఇటీవలే ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన పవన్.. తన భవిష్యత్తు సినీ ప్రయాణం గురించి చెప్పాడు. నిర్మాతగా, రామ్​చరణ్​తో త్వరలో ఓ సినిమా తీస్తానని అన్నాడు.

పవన్‌.. రాజకీయాలతో బిజీగా ఉంటూనే.. నిర్మాతగా తెలుగు చిత్రసీమలో కొనసాగుతూ ఉంటానని గతంలోనే చెప్పాడు. ఈ విషయంపై ఇప్పుడు మరోసారి స్పష్టతిచ్చాడు. చెర్రీతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, సరైన కథ, దర్శకుడు దొరకకపోవడం వల్లే ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతోందని పవన్​ అన్నాడు. రామ్‌చరణ్‌తో త్వరలో ఓ సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్తానని చెప్పాడు.

చరణ్​.. బాబాయ్‌ నిర్మాణంలో సినిమా చేయాలనుందని గతంలోనే చెప్పాడు. ఇప్పుడు పవన్‌ ప్రకటనతో అతడి కోరిక తీరడం దాదాపు ఖాయమైనట్లేనని తెలుస్తోంది. అన్ని కుదిరితే త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.

ఇవీ చూడండి.. 'సరిలేరు నీకెవ్వరు' ప్రీరిలీజ్ ఈవెంట్ తేదీ ఖరారు

AP Video Delivery Log - 0700 GMT News
Tuesday, 17 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0654: In Air Esper AP Clients Only 4245078
Esper discusses Turkey, North Korea, Afghanistan, Syria
AP-APTN-0631: Afghanistan US Senator AP Clients Only 4245076
US Senator: Pakistan should pressure Taliban
AP-APTN-0514: Hong Kong Security AP Clients Only 4245072
Hong Kong official gives update on protests
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.