ETV Bharat / sitara

ఆ నటి తల్లికి అండగా సల్మాన్​ఖాన్​

author img

By

Published : Feb 27, 2021, 2:47 PM IST

salman
సల్మాన్​

బాలీవుడ్​ స్టార్​ సల్మాన్​ ఖాన్​.. క్యాన్సర్​తో పోరాడుతోన్న నటి రాఖీ సావంత్​ తల్లికి ఆర్థిక సాయం చేశారు. దీంతో సల్మాన్​కు ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వీడియో సందేశాన్ని పంపారు.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్​ ఖాన్​ తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. క్యాన్సర్​తో బాధపడుతోన్న నటి రాఖీ సావంత్​ తల్లికి ఆర్థిక సాయం చేశారు. ఈ విషయమై సల్మాన్​తో పాటు ఆయన సోదరుడుకు సోహైల్​ ఖాన్​కు ఆమె ధన్యావాదాలు తెలిపారు. తన తల్లి మాట్లాడిన వీడియోను సావంత్​ ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది.

స‌ల్మాన్ లాంటి సోద‌రుడు తమకు దొర‌క‌డం దేవుడి ఆశీర్వాదం అని రాఖీ సావంత్ అన్నారు. రాఖీ సావంత్​ ఇటీవల జరిగిన హిందీ బిగ్​బాస్​ 14లో పాల్గొనగా.. రూ.14 లక్షల మొత్తంతో షో నుంచి బయటకు వచ్చింది.

ఇదీ చూడండి: కృష్ణ జింకల కేసులో సల్మాన్​కు కాస్త ఉపశమనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.