ETV Bharat / sitara

రెబల్​స్టార్ కృష్ణంరాజుకు ప్రభాస్ స్పెషల్ బర్త్​డే విషెస్

author img

By

Published : Jan 20, 2022, 12:15 PM IST

prabhas krishnam raju
ప్రభాస్ కృష్ణంరాజు

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో రెబల్​స్టార్ కృష్ణంరాజుకు ప్రభాస్ బర్త్​డే విషెస్, దునియా విజయ్​కు డైరెక్టర్ గోపీచంద్ బర్త్​డే శుభాకాంక్షలు, శుక్రవారం ఓటీటీలో రాబోయే చిత్రాల సంగతులు ఉన్నాయి.

*రెబల్​స్టార్ కృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా డార్లింగ్ ప్రభాస్, 'రాధేశ్యామ్' టీమ్​ ఆయనకు శుభాకాంక్షలు చెప్పింది. ఓ పోస్టర్​ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

prabhas krishnam raju
ప్రభాస్ ఇన్​స్టా పోస్ట్

'రాధేశ్యామ్'లో కృష్ణంరాజు, పరమహంస అనే సాధువు పాత్రలో నటించారు. కరోనా కారణంగా సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఇందులో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్​గా చేసింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు.

*బాలయ్య కొత్త సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న దునియా విజయ్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఆయనతో తీసుకున్న ఓ ఫొటోను పోస్ట్ చేశారు.

gopichand malineni dunia vijay
దునియా విజయ్​తో డైరెక్టర్ గోపీచంద్ మలినేని

#NBK107 టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రుతిహాసన్ హీరోయిన్​గా నటిస్తోంది. వరలక్ష్మి శరత్​కుమార్ కీలకపాత్రలో నటిస్తోంది. తమన్ సంగీతమందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

*ఓటీటీలో ఈ శుక్రవారం పలు క్రేజీ సినిమాలు, సిరీస్​లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇందులో బాలయ్య 'అఖండ' డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​లో, నాని 'శ్యామ్​సింగరాయ్' నెట్​ఫ్లిక్స్​లో, 'లూజర్' వెబ్ సిరీస్​ సీజన్ 2 జీ5లో అందుబాటులోకి రానున్నాయి. వీటి కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

nani shyam singha roy OTT
నాని 'శ్యామ్​సింగరాయ్' మూవీ
.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.