ETV Bharat / sitara

'పెళ్లిసందడి'తో హీరోగా కె.రాఘవేంద్రరావు!

author img

By

Published : Oct 25, 2020, 5:29 AM IST

ఇప్పటివరకు ఎన్నో మరపురాని చిత్రాల్ని అందించిన దర్శకుడు రాఘవేంద్రరావు.. తన కొత్త సినిమాలో హీరోగానూ నటించనున్నారట. ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

k raghavendra rao turned actor with pelli sandadi cinema
కె.రాఘవేంద్రరావు

చాలా విరామం తర్వాత కొత్త సినిమాను ప్రకటించిన దర్శకుడు రాఘవేంద్రరావు.. మరో సాహసానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఈయన ప్రధాన పాత్ర పోషించనున్నారని సమాచారం. ముగ్గురు హీరోయిన్లు ఇందులో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది.

ఒకవేళ ఇదే నిజమైతే పూర్తి స్థాయి పాత్రలో రాఘవేంద్రరావు నటించబోయే తొలి సినిమా ఇదే అవుతుంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటోంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

ఇది చదవండి: 'పెళ్లి సందడి' మళ్లీ మొదలవబోతుంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.