ETV Bharat / sitara

Ram Charan Movies: 14 ఏళ్ల నట ప్రస్థానం.. వెల్లివిరిసిన అభిమానం

author img

By

Published : Sep 28, 2021, 7:56 AM IST

Ram Charan
రామ్​ చరణ్

మెగా పవర్​స్టార్​ రామ్​ చరణ్(Ram Charan Movies).. తెలుగు తెరకు పరిచయమై నేటికి 14 ఏళ్లు గడిచాయి. ఈ సందర్భంగా ఆయనపై ఉన్న అభిమానాన్ని వినూత్న శైలిలో చాటుకున్నారు మెగా ఫ్యాన్స్. హైదరాబాద్​లోని నెక్లెస్‌ రోడ్డు సమీపంలో రామ్‌ చరణ్‌(Ram Charan Movies List) బొమ్మని గీసి, దానికి రంగులు వేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు రామ్‌ చరణ్‌(Ram Charan Movies) తెలుగు ప్రేక్షకులకు పరిచయమై 14 ఏళ్లు గడిచాయి. చరణ్ నటించిన తొలి చిత్రం 'చిరుత' విడుదలై నేటికి 14 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఆయన అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

రామ్‌ చరణ్‌పై(Ram Charan Movies List) ఉన్న అభిమానాన్ని ఆయన ఫ్యాన్స్​ వినూత్న శైలిలో చాటుకున్నారు. నెక్లెస్‌ రోడ్డు సమీపంలో రామ్‌ చరణ్‌ బొమ్మని గీసి, దానికి రంగులు వేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. 'మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌' అని రాసుకొచ్చారు. 'రాష్ట్ర రామ్‌ చరణ్‌ యువశక్తి' ఆధ్వర్యంలో సాగిన ఈ వేడుకలో పలువురు అభిమానులు పాల్గొని సందడి చేశారు.

మెగా ప్రస్థానం..

'చిరుత' చిత్రంతో రామ్‌ చరణ్‌(Ram Charan Movies List) నటుడిగా మారారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2007 సెప్టెంబరు 28న విడుదలైంది. అప్పట్లో ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. పవర్‌ఫుల్‌ సంభాషణలు, ఉర్రూతలూగించే డ్యాన్స్‌తో తొలి పరిచయంలోనే విశేషంగా ఆకట్టుకున్నాడు రామ్‌ చరణ్‌(Ram Charan Movies List). ఆ తర్వాత 'మగధీర', 'రచ్చ', 'నాయక్‌', 'ఎవడు', 'గోవిందుడు అందరివాడేలే', 'ధృవ', 'రంగస్థలం' తదితర చిత్రాలతో మెప్పించారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంతో బిజీగా ఉన్నారు.

మరోవైపు, కోలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు శంకర్‌తో(Ram Charan New Movie) ఓ చిత్రం చేయనున్నారు. ఆర్​సీ15 (RC 15 Ram Charan) అనే వర్కింగ్ టైటిల్​తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో చెర్రీతో ఆడిపాడనుంది కియారా అద్వానీ. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమన్​ స్వరాలు సమకూరుస్తున్నారు. కొరియోగ్రాఫర్​గా జానీ మాస్టర్, మాటల రచయితగా సాయి మాధవ్​ బుర్రాను ఇప్పటికే ఎంపిక చేసింది చిత్రబృందం. విలన్​గా మలయాళ నటుడు ఫహాద్​ ఫాజిల్​ నటిస్తారని ప్రచారం జరుగుతుంది.

ఇదీ చదవండి: RC15 Movie: ఒక్క ఫైట్ సీన్ కోసం రూ.10 కోట్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.