ETV Bharat / sitara

RC15 Movie: ఒక్క ఫైట్ సీన్ కోసం రూ.10 కోట్లు!

author img

By

Published : Sep 22, 2021, 12:40 PM IST

శంకర్​- రామ్​ చరణ్(RC15 Movie)​ కాంబినేషన్​లో ఓ సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా ఓ భారీ ట్రైన్ యాక్షన్​ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సీక్వెన్స్ కోసం ఏకంగా రూ.10 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

RC15 Movie
శంకర్​- రామ్​ చరణ్ సినిమా

డైరెక్టర్ శంకర్​ పేరు వినగానే మనకు గుర్తొచ్చేవి.. ఊహకందని విజువల్స్,అబ్బురపరిచే పాటల చిత్రీకరణ, భారీ బడ్జెట్ సినిమాలు, బాక్సాఫీస్ రికార్డులు. అయితే ప్రస్తుతం ఆయన రామ్​చరణ్​తో(Shankar Ram Charan Movie) కలిసి ప్రతిష్టాత్మకంగా ఓ చిత్రం తీస్తున్నారు. 'ఆర్​సీ-15'(RC15 Movie) అనే వర్కింగ్ టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది.

రూ.10కోట్లతో..

అయితే.. ఈ సినిమాలో ఓ భారీ ట్రైన్ యాక్షన్​ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారట దర్శకుడు శంకర్(Shankar Ram Charan Movie). ఈ ఫైట్​సీన్ కోసం ఏకంగా రూ.10 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే సినిమా విడుదలయ్యేంత వరకూ ఆగాల్సిందే.. ఇదివరకే ఐ, రోబో2లో భారీ ట్రైన్ యాక్షన్​ సీన్లతో అలరించాడు శంకర్.

RC15 Movie
శంకర్​- రామ్​ చరణ్ సినిమా పోస్టర్​

ఈ చిత్రంలో చెర్రీతో ఆడిపాడనుంది కియారా అద్వానీ. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమన్​ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవల 135 మంది మ్యూజిషియన్లతో కలిసి ఆయన ఈ సినిమాకు సంబంధించిన​ తొలి రికార్డింగ్​ పూర్తి చేశారు. కొరియోగ్రాఫర్​గా జానీ మాస్టర్, మాటల రచయితగా సాయి మాధవ్​ బుర్రాను ఇప్పటికే ఎంపిక చేసింది చిత్రబృందం. విలన్​గా మలయాళ నటుడు ఫహాద్​ ఫాజిల్​నటిస్తారని ప్రచారం జరుగుతుంది.

ఈ చిత్రంతో పాటు హిందీలో 'అనియన్‌'​(Anniyan Remake-తెలుగులో 'అపరిచితుడు') చిత్రాన్ని రీమేక్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్​చరణ్ 'ఆర్​ఆర్ఆర్' సినిమా(RRR Movie Release Date) ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

ఇదీ చదవండి: RC15: చరణ్​-శంకర్​ కొత్త సినిమా హంగామా షురూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.